Heroines Sons: తల్లులే కాదు.. కొడుకులు సినిమా స్టార్లే.. ఎవరో తెలుసుకోండి..
తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. ఆమె కుమారుడు కూడా హీరో అన్న విషయం చాలా మందికి తెలయదు. ఈమె కొడుకు శ్రేయాన్ ‘బస్తీ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడతో రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నాడు.

Heroines Sons: సినీ ఇండస్ట్రీల్లోకి వారసులు రావడం కామన్. అయితే ఎక్కువగా హీరోలు తమ కుమారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తారు. హీరోయిన్లు సినిమాల వరకే పరిమితమై ఆ తరువాత పెళ్లి చేసుకొన్న తరువాత మరోసారి ఇండస్ట్రీకి రావాలనుకోరు. కానీ కొందరు హీరోయిన్లు తమ లాగే తమ కుమారులను కూడా సినీ ఫీల్డులోకి తీసుకొచ్చారు. వారిలాగే వారి కొడుకులు కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకొని తల్లులకు గుర్తింపు తెచ్చారు. వీరిలో ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు. మరి వారి గురించి తెలుసుకుందామా..
తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. ఆమె కుమారుడు కూడా హీరో అన్న విషయం చాలా మందికి తెలయదు. ఈమె కొడుకు శ్రేయాన్ ‘బస్తీ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడతో రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నాడు.
రోజారమణి హీరోయిన్ అలనాటి ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ ఆమె కుమారుడు తరుణ్. ‘నువ్వేకావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన పలు సినిమాల్లో నటించారు. 2018లో ఇది నా లవ్ స్టోరీ సినిమా తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు.
అక్కినేని అమల గురించి తెలియని ప్రేక్షకులు లేరు. ఈమె కుమారుడు అఖిల్ ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్నాడు. చిన్నప్పుడే సిసింద్రీ ద్వారా పరిచయం అయన ఆయన ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. రీసెంట్ గా ‘ఏజెంట్’తో అలరించాడు.
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ పేమస్ నటి. ఈమె కుమారుడు సంజయ్ దత్ పాన్ ఇండియా స్టార్ హీరో. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.

Heroines Sons
బాలీవుడ్ బిగ్ బి సతీమణి జయాబచ్చన్ ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. ఆమె కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా స్టార్ గా కొనసాగుతున్నాడు.
హిందీలో అందమైన హీరోయిన్ అయిన షర్మిలా ఠాగూర్ కుమారుడు సైఫ్ అలీఖాన్. ఈ హీరో బీ టౌన్ లో స్టార్ హీరోల్లో ఒకరు. ఈయన తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చే సినిమాలో విలన్ గా అలరించే అవకాశం ఉంది.
నీతూకపూర్ కుమారుడు రణ బీర్ కపూర్. ఈయన స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ స్టార్లుగా కొనసాగుతున్నారు.
