Viral News: పెళ్లి మండపం అందంగా ముస్తాబైంది. బంధువులతో కిటకిటలాడుతోంది. మేళతాళాలు మోగుతున్నాయి. పీఠలపై పెళ్లికొడుకు ముఖంలో సంతోషం లేదు. పెళ్లి ఉత్సాహం లేదు. ఏదో తెలియని వెలితి. వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి పెళ్లికొడుకు తల్లి ఎగిరి గంతేసింది. ఒకామెను గట్టిగా కౌగిలించుకుంది. ఇక అంతే. పెళ్లి మండపంలో సంతోషం వెదజల్లబడింది. పట్టరాని సంతోషంతో పెళ్లి మండపం నిండిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు ? వారి సంతోషానికి కారణమేంటో ? ఈ స్టోరిలో తెలుసుకోండి.

Viral News
శ్రద్ధా షెల్లార్.. యూకేలో నివాసముంటోంది. చాలా ఏళ్లుగా అక్కడే ఉంటోంది. ఇండియాలో ఆమె సోదరుడి వివాహం జరుగుతోంది. ముఖ్యమైన పనుల కారణంగా వివాహానికి రాలేనని చెప్పింది. దీంతో ఆమె కుటుంబం డీలా పడింది. సోదరుడి వివాహానికి రాకపోతే ఎలా అంటూ తల్లిదండ్రులు బాధపడ్డారు. కానీ ముఖ్యమైన పనుల వల్ల రాలేకపోతున్నానని శ్రద్ధా సర్దిచెప్పింది. ఇక చేసేదిలేక తల్లిదండ్రులు సరే అన్నారు. కొడుకు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.
అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లికూతుర్ని పీఠలపైకి తీసుకొచ్చారు. ఇంకో కొన్ని నిమిషాల్లో మూడుముళ్ల తతంగం పూర్తవుతుంది. ఇంతలోనే సడెన్ గా శ్రద్ధా పెళ్లిమండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే శ్రద్ధా తల్లికి పట్టరాని సంతోషం వచ్చింది. శ్రధ్ధాను గట్టిగా కౌగిలించుకుంది. ఇక శ్రధ్ధ తండ్రి అయితే ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు. పెళ్ళికొడుకైన సోదరుడు కేకలు వేస్తూ సోదరిని కౌగిలించుకున్నాడు. పెళ్లిమండపంలో ఏం జరుగుతుందో తెలియక పెళ్లికూతురు అయోమయంలో ఉంది. సోదరిని పెళ్లికొడుకు కౌగించుకునే సందర్భంలో పెళ్లికూతరు ముఖం వాడిపోయిందని చెప్పుకోవాలి. వాస్తవంగా శ్రద్దా .. పెళ్లికొడుకు సోదరి అన్న విషయం పెళ్లికూతురుకి తెలియదు. చివరికి విషయం తెలియడంతో పెళ్లికూతురు ఊపిరిపీల్చుకుంది.

Viral News
శ్రద్ధా ఇదంతా తన ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయడానికి చేసింది. వీడియో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి మూడు లక్షల వ్యూవ్స్, 42వేల లైక్స్ వచ్చాయి. కుటుంబ బంధాలు, భావోద్వేగంతో కూడిన ఈ వీడియోను జనం తెగ షేర్ చేస్తున్నారు. వైరల్ గా మార్చేశారు. యూజర్లు ఒక్కోరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. పెళ్లిలో పెళ్లికూతురు పై ఉండాల్సిన బంధువుల దృష్టిని శ్రద్ధా తన వైపు తిప్పుకుందని కొందరు కామెంట్ చేశారు. కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం కట్టిపడేసిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram