XiJinping : సెక్యూరిటీని ఆపేసి డోర్ వేశారు.. చైనా అధ్యక్షుడు భయపడ్డాడు.. ఈ సీన్ చూడాల్సిందే!
బలవంతమైన పాము సైతం చలి చీమల చేతి చిక్కితే చావు తప్పదు.. భయపెట్టడం కాదు.. భయం అంటే ఏమిటి.. భయపడడం ఎలా ఉంటుంది అని కూడా తెలిసి ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

XiJinping : ఎప్పుడూ భయపెట్టడమే కాదు.. భయ పడడం కూడా తెలిసి ఉండాలి.. లేకుంటే ఇలా చైనా అధ్యక్షుడిగా చుట్టూ సెక్యూరిటీ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. భయంతో ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భయపడ్డారా.. అంత శక్తివతమైన దేశానికి అధ్యక్షుడిని భయపెట్టిన అంశం ఏమిటి.. ఏ సందర్భంలో భయపడ్డారు.. ఈగ కూడా వాలకుండా చూసుకునే సెక్యూరిటీ ఉన్నా కూడా ఒంటరిగా ఎందుకు అయ్యారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైనా అధ్యక్షుడు భయపడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రిక్స్ సమావేశంలో..
జిన్‌పింగ్.. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. తన గది నుంచి సమావేశ మందిరానికి వెళ్లేందుకు ప్రత్యేక భద్రత ఉన్న మార్గం ఏర్పాటు చేశారు. బ్రిక్స్ దేశాల అధినేతలంతా ఈ మార్గం గుండానే సమావేశానికి చేరుకున్నారు. జిన్‌పింగ్ కూడా సదస్సులో పాల్గొనేందుకు ఓ హాల్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా, ఆయన వెంట వచ్చిన డెలిగేట్స్, సెక్యూరిటీ సిబ్బందిని హాలు ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా అతడ్ని అడ్డుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తున్నది. ఆ వెంటనే ఎంట్రన్స్ మూసేశారు.
ఏం జరుగుతుందో అర్థం కాక..
దీంతో కాస్త ఇబ్బందిగా ముందుకెళ్లిన జిన్ పింగ్.. కొద్ది సేపు నిలుచుండి పోయారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ముందుకు అడుగు వేయడానికి కూడా భయపడ్డారు. అయోమయంతో వెనక్కి తిరిగి చూసి నడుచుకుంటూ ముందుకెళ్లి పోయారు.
సోషల్ మీడియాలో వైరల్..
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తామే బలవంతులం అనుకునే వారు.. ఇలా భయపడడం ఏంటి.. బలవంతమైన పాము సైతం చలి చీమల చేతి చిక్కితే చావు తప్పదు.. భయపెట్టడం కాదు.. భయం అంటే ఏమిటి.. భయపడడం ఎలా ఉంటుంది అని కూడా తెలిసి ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1694651269737328730
