Adipurush Second Trailer: సంచలన రికార్డ్స్ కి కేంద్ర బిందువుగా ‘ఆదిపురుష్.. రెండో ట్రైలర్ కు 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే!
కేవలం 24 గంటల్లో అన్నీ భాషలకు కలిపి 40 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, రెండవ ట్రైలర్ కి ఈ స్థాయి వ్యూస్ రావడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా జరగలేదు. అది కేవలం ఆదిపురుష్ విషయం లో మాత్రమే జరిగింది.

Adipurush Second Trailer: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం గురించి ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని తిరుపతి లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మూవీ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక అదే రోజు విడుదల చేసిన ‘ఆదిపురుష్’ రెండవ ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.
మొదటి ట్రైలర్ మొత్తం రామాయణం గురించి కొన్ని కీలకమైన ఘట్టాలను చూపించగా,రెండవ ట్రైలర్ లో రామ రావణ యుద్ధం గురించి చూపించారు. ఈ ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ సినిమాని చూస్తే 3D లోనే చూడాలి అనిపించింది. ఇక పోతే యూట్యూబ్ లో ఈ రెండవ ట్రైలర్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.
కేవలం 24 గంటల్లో అన్నీ భాషలకు కలిపి 40 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, రెండవ ట్రైలర్ కి ఈ స్థాయి వ్యూస్ రావడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా జరగలేదు. అది కేవలం ఆదిపురుష్ విషయం లో మాత్రమే జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఒక్క కట్ కూడా చెప్పకుండా క్లీన్ U సర్టిఫికేట్ ని జారీ చేసింది.ఈమధ్య కాలం లో క్లీన్ U సర్టిఫికేట్ వచ్చిన సినిమాలే లేవు, అలాంటిది ‘ఆదిపురుష్’ చిత్రానికి వచ్చిందంటే కచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.
రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే సినిమా లెంగ్త్ 2 గంటల 59 నిమిషాలు ఉంటుంది. ఇంత భారీ లెంగ్త్ ఉన్న సినిమాలు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండాలి, లేకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులు కోరుకున్న విధంగా ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో ఉంటుందా లేదా అనేది తెలియాలంటే 16 వ తారీఖు వరకు ఆగాల్సిందే.
