
Jagan- Lokesh
Jagan- Lokesh: పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సభల్లో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.. కానీ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ రోజుకు ఐదు నుంచి ఆరు సభల్లో మాట్లాడుతున్నారు. దీంతో పాటు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి కంటే నారా లోకేష్ బెటర్ అన్న విశ్లేషన్లు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో కొద్దిరోజుల కిందట పాదయాత్రను ప్రారంభించిన సమయంలో.. లోకేష్ పాదయాత్ర పూర్తి చేసేనా.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేనా.. అంటూ పాదయాత్ర పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పాదయాత్రలో లోకేష్ నడిచిన తీరును ఎద్దేవా చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. నెలరోజులు పాదయాత్ర చేస్తే చాలు అన్నంత రీతిలో విమర్శలు బాణాలను ఎక్కిపెట్టారు. అయితే, ఆ విమర్శలన్నింటికీ చేతల ద్వారానే నారా లోకేష్ సమాధానం చెబుతున్నారు. పాదయాత్రను ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేస్తున్నారు. అయితే పాదయాత్రలో లోకేష్ వ్యవహార శైలి, మాట్లాడుతున్న తీరు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఇస్తున్న సమాధానాలు వంటి అనేక అంశాలను పరిశీలిస్తున్న ప్రజలు, విశ్లేషకులు నాటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన వ్యవహార శైలితో పోలుస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే అనేక విధాలుగా లోకేష్ బెటర్ గా కనిపిస్తున్నారని భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Jagan- Lokesh
ఐదు నుంచి ఆరు సభల్లో..
గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే సభల్లో మాట్లాడేవారు. కానీ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ప్రతిరోజు 5 నుంచి 6 సభలో సుదీర్ఘంగా ఉపన్యసిస్తున్నారు. అనేక అంశాలపై ప్రజలకు స్పష్టతనిస్తున్నారు. అలాగే ఆయా సభలు సందర్భంగా నిర్వహిస్తున్న ముఖాముఖిలో యువత అడుగుతున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి అభిమానాన్ని చురగొనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ తరహా సభలు, ముఖాముఖీలు నిర్వహించిన సందర్భాలు లేవని పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశాలను పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ప్రస్తుతం నారా లోకేష్ బెటర్ గా ఉన్నారని చెబుతున్నారు.
నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం..
ఇక పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఆయా ప్రాంతాల్లో ఇస్తున్న హామీలను నెరవేర్చే బాధ్యత తనది అంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇచ్చే హామీలకు అనుగుణంగా శిలాఫలకాలను ఏర్పాటు చేస్తూ.. వీటిని అమలు చేయకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శిలాఫలకాలను చూపించి ప్రశ్నించవచ్చని చెబుతున్నారు. దీని ద్వారా తాను ఇచ్చే హామీలకు కంకణబద్ధుడిని అయి ఉంటానన్న హామీను ప్రజలకు ఇస్తున్నారు.

Jagan- Lokesh
రాటుదేలుతున్న లోకేష్..
పాదయాత్ర ప్రారంభించిన సమయంలో పప్పు చేసే యాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేమంటూ పెద్ద ఎత్తున అధికార పక్షం నాయకులు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో అయితే నారా గంగాళం యాత్ర, పులకేసి యాత్ర అంటూ ట్రోలింగ్ చేశారు. అయినా వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళుతున్న లోకేష్ ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శలు చేస్తూ ఆలోచన రేకెత్తిస్తున్నాడు.