
Pakistan Prime Minister
Pakistan Prime Minister: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు వివాదాల్లో ఉంటారు. తన చేష్టలతో ప్రజల ఆగ్రహానికి గురి కావడం ఆయనకు అలవాటే. తాజాగా ఆయనపై మరో ఆరోపణ వచ్చింది. ఇతర దేశాధినేతలు ఇచ్చిన విలువైన బహుమతులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అందరు చెప్పుకుంటారు. దీంతో ఆయన ఆలోచనలు సైతం దుమారం రేపుతాయి.
ఇతర దేశాల నుంచి అందుకున్న ఓ విలువైన బహుమతిని తన స్నేహితుడి ద్వారా విక్రయించి రూ. 7 కోట్లు సంపాదించారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనపై విమర్శల పరంపర కొనసాగుతోంది. సాధారణంగా ఇతర దేశాల నేతలు ఇచ్చిన బహుమతులు అమ్ముకునేందుకు అవకాశం లేకపోయినా ఇమ్రాన్ ఖాన్ ఈ పనిచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక దేశం నుంచి వచ్చే బహుమతులను గిఫ్ట్ డిపాజిటరీ నిబంధనల ప్రకారం బహిరంగ వేలంలో విక్రయించే అవకాశం ఉన్నా అలా చేయకుండా ఇమ్రాన్ ఖాన్ అమ్మడంపై పెద్ద వివాదమే రేగుతోంది. గతంలో కూడా ఓ విలువైన గడియారాన్ని కూడా ఇలాగే విక్రయించి దొరికిపోయిన ఇమ్రాన్ ఖాన్ ఈసారి మాత్రం పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న పాక్ కు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం కూడా కొరకరాని కొయ్యగా తయారయిందనే చెప్పాలి.
ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియ సైతం ట్వీట్ చేశారు. విలువైన బహుమతులు అమ్ముకుంటూ స్వార్థంతో ఆలోచిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న ఇమ్రాన్ ఖాన్ పై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.