Bigg Boss 6 Telugu Title Winner: గడిచిన బిగ్ బాస్ సీజన్స్ లో టైటిల్ విన్నర్ ఎవరూ అనేది చాలా తేలికగా తెలిసిపొయ్యేది..ఎందుకంటే సోషల్ మీడియా లో జరిగే ఓటింగ్స్ ఆధారంగా ఎవరైతే కంటిన్యూ గా అత్యధిక ఓట్లతో డామినేట్ చేస్తూ వస్తారో వాళ్ళే టైటిల్ గెలుస్తూ వచ్చారు..సీజన్ 1 నుండి సీజన్ 5 వరుకు అదే జరిగింది..ఎలిమినేషన్స్ కూడా సోషల్ మీడియా లో వచ్చే ఓటింగ్స్ కి తగ్గట్టుగానే తూచాతప్పకుండా ఫలితాలు వచ్చేవి..కానీ సీజన్ 6 లో మాత్రం ఫలితాలు ఊహకందని విధంగా వస్తున్నాయి.

Bigg Boss 6 Telugu Title Winner:
ఇప్పటి వరుకు జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ కూడా మనం ఊహించిన విధంగా జరగలేదు..ఇప్పుడు టైటిల్ విన్నర్ స్థానం కి కూడా అదే పరిస్థితి వచ్చింది..మొదటి వారం నుండి నేటి వరుకు రేవంత్ అందరికంటే అత్యధిక ఓట్లు దక్కించుకుంటూ తన డామినేషన్ ని చూపిస్తున్నాడు..కానీ గత కొద్దీ వారాలుగా ఇనాయ మరియు రోహిత్ రేవంత్ ఓటింగ్ శాతం కి చాలా దగ్గరగా వచ్చేస్తున్నారు..పరిసితి ఇలాగె కొనసాగితే రేవంత్ టైటిల్ గెలవడం చాలా కష్టమే.
ఇనాయ కి సోషల్ మీడియా లో ఈమధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది..అందరూ ఆమెని లేడీ టైగర్ అని పిలుస్తున్నారు..టాస్కులలో మగవాళ్ళతో సమానంగా ఆడడం తో పాటు,ఏదైనా గొడవ జరిగినప్పుడు హౌస్ మేట్స్ మొత్తం తన మీదకి వచ్చిన సింగిల్ గా అందరికి సమాధానం చెప్పడం వంటివి ఆడియన్స్ కి బాగా నచ్చేసింది..ఇలాంటి లేడీ కంటెస్టెంట్ ని ఇప్పటి వరుకు చూడలేదంటూ నెటిజెన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు..బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో ఇప్పటి వరుకు అమ్మాయి టైటిల్ గెలవలేదు కాబట్టి , టాప్ 5 లోకి వచ్చిన ఇనాయ టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్న మాట.

Bigg Boss 6 Telugu Title Winner:
మరోపక్క రోహిత్ కి కూడా ఇనాయ తో సరిసమానమైన ఓట్లు వస్తున్నాయి..ఈ వారం లో అతను గేమ్ మరింత బాగా ఆడితే అతనికి కూడా టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..మరి వీరి ముగ్గురిలో టైటిల్ ఎవరూ గెలవబోతున్నారు అనేది చివరి నిమిషం వరుకు తెలియని పరిస్థితి ప్రస్తుత సీజన్ లో నెలకొంది.