Ram Gopal Varma: మందేస్తూ, దమ్ముకొడుతూ అమ్మాయితో పబ్ లో అడ్డంగా దొరికిన ఆర్జీవీ!

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ లీడర్స్ ని గెలుకుతూ ఉంటాడు. ఆయన కొన్నాళ్లుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ట్రోల్ చేస్తున్నారు. వారి వ్యక్తిత్వం దెబ్బతీసేలా సినిమాలు కూడా చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్ చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మీద పలుమార్లు దాడులకు తెగబడ్డారు. పవన్, చంద్రబాబులను వ్యతిరేకించే రామ్ గోపాల్ వర్మ వైఎస్ జగన్ కి మాత్రం […]

  • Written By: SRK
  • Published On:
Ram Gopal Varma: మందేస్తూ, దమ్ముకొడుతూ అమ్మాయితో పబ్ లో అడ్డంగా దొరికిన ఆర్జీవీ!

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ లీడర్స్ ని గెలుకుతూ ఉంటాడు. ఆయన కొన్నాళ్లుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ట్రోల్ చేస్తున్నారు. వారి వ్యక్తిత్వం దెబ్బతీసేలా సినిమాలు కూడా చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్ చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మీద పలుమార్లు దాడులకు తెగబడ్డారు. పవన్, చంద్రబాబులను వ్యతిరేకించే రామ్ గోపాల్ వర్మ వైఎస్ జగన్ కి మాత్రం అనుకూలంగా మాట్లాడతాడు. అతన్ని వర్మ ట్రోల్ చేసిన సందర్భాలు లేవు. ఆ మధ్య సీఎం జగన్ ని వర్మ కలిశారు.

ఏపీ పాలిటిక్స్ మీద రామ్ గోపాల్ వర్మ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత గత రెండు రోజులుగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పొలిటికల్ స్టేట్మెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన సీఎం రేసులో లేను. వైసీపీని గద్దె దించేందుకు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇతర ప్రధాన పార్టీలతో పొత్తుకు సిద్ధం అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇది కాపులకు వెన్నుపోటు పొడవడమే అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబు ఎలాగైతే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచాడో కాపులకు పవన్ కళ్యాణ్ అలానే వెన్నుపోటు పొడిచారు. జనసేన అభిమానులకు వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి… అంటూ ఓ సెటైరికల్ ట్వీట్ వేశాడు. మరొక ట్వీట్ Rip జనసేన. బాధలో మేమిద్దరం పార్టీ చేసుకుంటున్నామని ఓ ఫోటో పోస్ట్ చేశారు. పబ్ లో ఫుల్ గా మందేస్తూ అమ్మాయితో దమ్ముకొడుతున్న ఆ ఫోటో వైరల్ అవుతుంది.

జనసేన అభిమానులు ఓ రేంజ్ లో వర్మ మీద విరుచుకుపడుతున్నారు. ఈ పార్టీకి మీరు వైఎస్ జగన్ కి కూడా పిలవాల్సింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. వర్మను తిట్టిపోస్తున్నారు. వర్మ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన పొలిటికల్ థ్రిల్లర్ పై మరలా ఎలాంటి అప్డేట్ లేదు. ఈ మూవీ ఆయన జగన్ కి ఫేవర్ గా చేస్తున్నారనే వాదన ఉంది. జగన్ ని కలిసిన అనంతరం వర్మ ఈ చిత్ర ప్రకటన చేశారు.

https://twitter.com/RGVzoomin/status/1657052328225300481?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1657052328225300481%7Ctwgr%5E983c0c415001f0a41f8aa5a0df3266d4e483a6a8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.filmibeat.com%2Fnews%2Fpawan-kalyan-fans-trolls-ram-gopal-varma-over-rip-jana-sena-119746.html

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు