Anasuya Bharadwaj: సోషల్ మీడియా వేధింపులపై యాంకర్ అనసూయ ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఫిర్యాదుతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా సాయి రవి 267 ఐడీతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనసూయతో పాటు రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, శ్రీముఖి, నటి ప్రగతి వంటి మహిళా సెలబ్రిటీలపై పండరి రామ వెంకట వీర్రాజు అనే వ్యక్తి అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నాడు. బూతు కామెంట్స్ తో మానసిక వేదనకు గురి చేస్తున్నాడు. చాలా కాలంగా వీర్రాజు సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్నాడని గ్రహించిన అనసూయ అతనిపై ఫిర్యాదు చేశారు.

Anasuya Bharadwaj
అనసూయ కంప్లైంట్ ఆధారంగా సైబర్ పోలీసులు వీర్రాజును అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీర్రాజు అరెస్ట్ నేపథ్యంలో అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్న మిగతా వారు భయపడాలనే ఉద్దేశంతో తన అకౌంట్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు. కాగా అనసూయపై సోషల్ మీడియా నెగిటివిటీ, ట్రోల్స్ అధికం కాగా అనసూయ తిరిగి పోరాటం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఫెయిల్యూర్ పై అనసూయ పరోక్షంగా ట్వీట్ చేశారు. అది ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఆంటీ హ్యాష్ ట్యాగ్ మూడు రోజులు ట్విట్టర్ లో ట్రెండ్ కావడం విశేషం. ఆ సమయంలో అనసూయ కూడా తగ్గకుండా తనను ట్రోల్ చేస్తున్న వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. కొందరు ట్విట్టర్ ఐడీల ఆధారంగా కంప్లైంట్స్ చేశారు. అయినా అనసూయపై సోషల్ మీడియా వేధింపులు తగ్గలేదు.

Anasuya Bharadwaj
అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ క్రింద కామెంట్స్ రూపంలో ఆమె యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. తాజా అరెస్ట్ తో ఆమెను ట్రోల్ చేస్తున్న వారు భయపడతారని అనసూయ నమ్ముతున్నారు. మరి ఏ మేరకు అనసూయ విజయం సాధించారో చూడాలి. కాగా అనసూయ పూర్తి ఫోకస్ యాక్టింగ్ పై పెట్టినట్లున్నారు. ఆమె బుల్లితెర షోస్ పూర్తిగా వదిలేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, సిరీస్లు చేస్తున్న అనసూయ… స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు.