Samantha Health: భయంకరమైన ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ సమంత పరిస్థితిపై మీడియాలో రోజుకో కథనం వచ్చేస్తోంది. సమంత ఆరోగ్యం విషమం అని.. ఆమెను దక్షిణకొరియాకు లేదా సింగపూర్ కు తరలించారంటూ ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అందరూ సమంతను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఇంకొందరు సినీ ప్రముఖులైతే ఆమెకు ఫోన్ చేసి మరీ ఆరాతీస్తున్నారు.

Samantha
నాగచైతన్యతో విడిపోయాక సమంత కృంగిపోయింది. ఆయన ఎడబాటును తట్టుకోలేక డిప్రెషన్ కు గురైంది. ఈ క్రమంలోనే భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెంచింది. మానసిక, శారీరక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే సమంతకు ఈ ‘మయోసైటిస్’ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధి సోకింది. ఈ ‘కండరాల క్షీణత’ వ్యాధికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది.
ఇప్పటికే ఈ అరుదైన వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్న సమంత హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ఉంటూ చికిత్స కొనసాగిస్తోంది. ఇటీవలే ఆమె తన కొత్త సినిమా డైలాగ్ వెర్షన్ ను సెలైన్ పెట్టుకొనే పూర్తి చేసింది. ఇక ప్రమోషన్స్ లోనూ పాల్గొని తనకు సోకిన ప్రాణాంతక వ్యాధిని బయటపెట్టింది.

Samantha Health
తాజాగా సమంత పరిస్థితి విషమించడంతో కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లలో కథనాలు రావడంతో సమంత టీం వివరణ ఇచ్చింది. సమంత ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తల్లో నిజం లేదని ఆమె మేనేజర్ తెలిపారు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉందని.. ఆమె ఆరోగ్యంపై దయచేసి ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని సమంత కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Mahesh-Trivikram Movie: విడుదలకు ముందే కోట్ల నష్టం… మహేష్-త్రివిక్రమ్ కలిసి నిర్మాతను ముంచేశారే!