SS Rajamouli: నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుల జాబితాలోకి ఎక్కేసింది. అవార్డు వస్తే సంతోషం. ఒక భారతీయ సినిమాకు, టెక్నీషియన్లకు ఆస్కార్ అవార్డు వస్తే మస్తు ఖుషి. అందులోనూ ఓ తెలుగు సినిమాకు వస్తే మరింత ఖుషీ. కానీ లాబీయింగ్, డొంక తిరుగుడు, డబ్బు ఖర్చు, మేనేజింగ్ థింగ్స్ అవార్డులను ప్రభావితం చేసే పక్షంలో వాటికి విలువ ఏముంటుంది..ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇదే జరుగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి అండ్ గ్యాంగ్ అక్కడే అడ్డా వేసింది కాబట్టి. వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి ఏ విభాగంలో కూడా ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ లభించలేదు. అదేదో చెల్లే షో అనే గుజరాతి సినిమాకు ఎంట్రీ వచ్చింది. అప్పటి దాకా ఆర్ ఆర్ ఆర్ మీద ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ నిర్ణయంతో రాజమౌళికి మైండ్ బ్లాంక్ అయింది.. దీంతో అతడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.. ఆస్కార్ పోటీలో ఎంట్రీకి ఫర్ యువర్ కన్సిడరేషన్ కింద దరఖాస్తు చేశాడు.. ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు.

SS Rajamouli
అవార్డుల పోటీకి పంపించదగిన మరో కేటగిరి ఏది మిగల్లేదు.. ఒక రకంగా చెప్పాలంటే వీటిని ప్రైవేట్ ఎంట్రీలు అంటారు.. అయితే చివరకు వీటిని అనఫీషియల్ నామినేషన్ల జాబితాలో చేర్చితేనే అంతిమ పోటీలో ఉంటాయి.. ఎన్ని కేటగిరిలో ఎంట్రీ కోసం లాబీయింగ్ చేశారు.. జస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే కేటగిరిలో నాటు నాటు పాట తప్ప ఎవరు కూడా సోదిలో లేకుండా పోయారు.
ఆర్ ఆర్ ఆర్ మాత్రమే కాదు చాలా ఇండియన్ సినిమాలను ఇలానే ఎఫ్వైసీ కింద దరఖాస్తు చేశారు.. వస్తే కొండ, పోతే వెంట్రుక… ఒకప్పటి రాఘవేంద్రరావు పరిచయం చేసిన రాజమౌళి కాదు కాబట్టి.. బలమైన లాబియింగ్ చేయగలిగాడు.. జపాన్ వెళ్లి ప్రచారం చేసుకున్నాడు.. ఏదో దేశం వెళ్లి పురస్కారం తెచ్చుకున్నాడు.. ఆయా దేశాల పత్రికల్లో వార్తలు రాయించాడు.. ఒకరకంగా చెప్పాలంటే మస్తు ప్రచారం చేసుకోగలిగాడు.. ఎప్పుడైతే నాటు నాటు పాటకు గోల్డెన్ క్లబ్ అవార్డు వచ్చిందో, ఇంకేముంది ఈ పాట కైనా అవార్డు గ్యారెంటీ అనే వాతావరణం ఏర్పడింది. వాస్తవానికి హాలీవుడ్ జర్నలిస్టుల సంఘం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇస్తూ ఉంటుంది. ఏదో ఇచ్చి ఉన్నారు కాబట్టే అవార్డు వచ్చిందని ప్రచారం కూడా జరిగింది.

SS Rajamouli
నిజంగానే ఆ ఒక్క కేటగిరిలో ఆ పాట తప్ప ఇంకేమీ ఇప్పుడు అధికారిక నామినేషన్ల జాబితాలో మిగల్లేదు.. అప్పుడే ఎన్టీఆర్ కు ఆస్కార్ అన్నారు. మరి మా రామ్ చరణ్ కూడా నటించాడు కదా ఆయన మాటేమిటి అని ఫ్యాన్స్ బాధపడ్డారు.. నిజానికి ఈ ప్రైవేట్ ఎంట్రీ లే పెద్ద మాయ.. స్థూలంగా చెప్పాలంటే మన ఇండియన్ సినిమాలను ఆ తెల్ల జాతీయులు అసలు దేకరు… వివక్ష చూపుతూ ఉంటారు.. ఈ నిజాన్ని రాజమౌళి గమనించలేదు.. అన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన రాజమౌళికి ఈ విషయం ఎవరూ చెప్పలేదా? పైగా ప్రైవేట్ ఎంట్రీలు అంటే వాళ్లకు చిన్న చూపు.. కన్నాటు నాటు టిపికల్ ఇండియన్ సినిమా పాట.. తెలుగు వాళ్లకు నచ్చుతుందేమో గాని… ఇంగ్లీష్ న్యాయ నిర్ణీత ఎలా స్వీకరిస్తాడో అర్థం చేసుకోవచ్చు.. సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ పాటకు గనుక ఆస్కార్ వస్తే సంతోషం.. అద్భుతం కూడా.. గట్టిగా పండగ చేసుకోవచ్చు.. మన పాట అది.. చంద్రబోస్ తప్పొప్పుల సంగతి పక్కన పెడదాం.. ఆ ఎర్ర జొన్న రొట్టెను, కీసుపిట్టను దూరం పెట్టేద్దాం. ఆ లెక్కన చూస్తే మన హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని కామెరూన్ ఆస్కార్ కొట్టేశాడు కదా… దాంతో పోలిస్తే మనం ఎంత… అవార్డు వస్తే గట్టిగా గుండెలకు హత్తుకుందాం.