Teaser for ‘Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు కోసం రెండు టీజర్లు రెడీ చేసిన మూవీ టీం..ఫాన్స్ కి పండగే

Teaser for ‘Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. కెరీర్ లోనే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడికల్ జానర్ లో సినిమా చేస్తుండడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి..దానికి తోడు పవన్ కళ్యాణ్ నుండి 5 ఏళ్ళ తర్వాత వస్తున్న డైరెక్ట్ సినిమా.. అనగా అజ్ఞాతవాసి […]

  • Written By: Neelambaram
  • Published On:
Teaser for ‘Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు కోసం రెండు టీజర్లు రెడీ చేసిన మూవీ టీం..ఫాన్స్ కి పండగే

Teaser for ‘Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. కెరీర్ లోనే మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడికల్ జానర్ లో సినిమా చేస్తుండడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి..దానికి తోడు పవన్ కళ్యాణ్ నుండి 5 ఏళ్ళ తర్వాత వస్తున్న డైరెక్ట్ సినిమా.. అనగా అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ ఈ రెండు సినిమాలు కూడా రీమేకులే, రీమేక్స్ అయ్యినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ డైరెక్ట్ సినిమా తో మన ముందుకి వస్తుండడం తో అభిమానుల్లోనే కాదు. ఫాన్స్ ప్రేక్షకుల్లో కూడా అమితాసక్తి ఏర్పడింది. అయితే గత కొంతకాలం నుండి ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. దీనితో ఈ సినిమా పూర్తిగా ఆపేశారంటూ సోషల్ మీడియా లో రకరకాల వార్తలు ఎన్నో ప్రచారం అయ్యాయి.

Teaser for 'Hari Hara Veera Mallu

Teaser for ‘Hari Hara Veera Mallu

AlSO Read: Pawan Kalyan Jalsa movie: ప్రపంచ రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్ జల్సా సినిమా స్పెషల్ షోలు

కానీ అలాంటిది ఏమి లేదని, ఈ సినిమా సెట్స్ వెయ్యడానికి చాలా సమయం పడుతుందని, అతి త్వరలోనే అవి పూర్తి చేసి షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు ఆ చిత్ర నిర్మాత AM రత్నం గారు..ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 30 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త పండగ చేసుకునే విధంగా ఉంది..అదేమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కట్స్ రెండు సిద్ధం చేస్తున్నారు..వీటిల్లో పవన్ కళ్యాణ్ ఒకటి సెలెక్ట్ చెయ్యబోతున్నాడు..ఈ టీజర్ కట్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం..త్వరలోనే దీనికి సమందించిన అధికారిక ప్రకటన చేయబోతుంది మూవీ టీం..ఈ టీజర్ జల్సా సినిమా స్పెషల్ షోస్ లో ఇంటర్వెల్ అప్పుడు కూడా వేస్తారట..అభిమానులకు ఇక పండగే.

Teaser for 'Hari Hara Veera Mallu

Teaser for ‘Hari Hara Veera Mallu

Also Read: problems come with romance aside: శృంగారాన్ని పక్కన పెడితే ఏ సమస్యలు వస్తాయో తెలుసా?

Read Today's Latest Actors News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు