Shaakuntalam Second Single: శాకుంతలం విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. శాకుంతలం ట్రైలర్ మెప్పించింది. విజువల్స్ తో కూడిన లవ్ అండ్ ఎమోషనల్ మైథలాజికల్ డ్రామా ఆసక్తి రేపింది. జనవరి 25న సెకండ్ సింగిల్ ‘ఋషివనం లోన’ విడుదల చేశారు.సిధ్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఈ సాంగ్ పాడారు. యంగ్ లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందించారు. మోడరన్ లవ్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సిధ్ శ్రీరామ్ అచ్చ తెలుగు పదాలతో కూడిన పాట పాడటం కొత్తగా ఉంది.

Shaakuntalam Second Single
విదేశాల్లో పుట్టి పెరిగిన సిధ్ శ్రీరామ్ కి ఇండియన్ లాంగ్వేజెస్ మీద పట్టులేదు. ఆయనకు తెలుగు పదాలు స్పష్టంగా పలకవు. ఆయనతో గ్రాంథిక తెలుగుతో కూడిన సాంగ్ పాడించడం నిజంగా సాహసం. అయితే సిధ్ శ్రీరామ్ న్యాయం చేశారు. ఇండియాలోనే టాప్ సింగర్స్ లో ఒకరిగా ఎదిగిన సిధ్ శ్రీరామ్ అనేక బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడారు. ఆయన గొంతులో ఏదో మ్యాజిక్ ఉందని ఆడియన్స్ నమ్ముతారు. ఇక చిన్మయి శ్రీపాద టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మణిశర్మ మెలోడియస్ ట్యూన్స్ కి సిధ్ శ్రీరామ్, చిన్మయి తమ గాత్రంతో అందం తెచ్చారు. శాకుంతలం నుండి విడుదలైన రెండు పాటలు అంచనాలు అందుకున్నాయని చెప్పొచ్చు. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజుతో పాటు గుణశేఖర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
దాదాపు సెట్టింగ్స్ లో శాకుంతలం మూవీ పూర్తి చేశారు. అందుకే షూటింగ్ కి చాలా తక్కువ సమయం పట్టింది. విజువల్స్ బేస్డ్ మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. విశ్వామిత్రుడు-మేనకల కూతురైన శకుంతల కథే ఈ శాకుంతలం. పురాణాల మీద కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ శకుంతల గురించి తెలుసు. ఈ జనరేషన్ కి ఇది కొత్త కథే. రాముడు, కృష్ణుడు అంటే తెలియని యూత్ కి శకుంతల ఎమోషనల్ లవ్ స్టోరీ తెలిసే అవకాశాలు తక్కువే.

Shaakuntalam Second Single
ఫిబ్రవరి 17న శాకుంతలం వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. సమంతకు జంటగా మలయాళ నటుడు మోహన్ దేవ్ నటించారు. విలక్షణ నటుడు మోహన్ బాబు కీలకమైన దుర్వాస మహర్షి పాత్ర చేశారు. వరుస విజయాలతో జోరుమీదున్న సమంతకు శాకుంతలం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.