Samantha Ruth Prabhu : సమంత ను అలా బూతులతో తిట్టేశాడు…బాధపడిన హీరోయిన్
మొత్తానికి ఎందుకు ఆ మనిషిని ఇబ్బంది పెట్టడం అనుకునిందో ఏమో తెలియదు కానీ సమంత మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేయకూడదు అనుకుని తనలో తానే బాధపడిందంట.

Samantha Ruth Prabhu : టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటించిన ఖుషి సినిమా నిన్న థియేటర్స్ లో విడుదలై పాజిటివ్స్ స్పందన తెచ్చుకుంటున సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమంతా గురించి ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో సమంతా పై ఎన్నో విమర్శలు వచ్చినా.. సమంత మాత్రం వాటికి పెద్దగా స్పందించదు. దీన్ని బట్టి ఈ హీరోయిన్ చిన్న విషయాన్ని పెద్దది చెయ్యదు అని మనకు అర్థం అయిపోతుంది. ఇలాంటి తరుణంలో ఒక మామూలు వ్యక్తి సమంతా ని ఒక బూతు మాట అన్నాకాని ఆమె బాధ పడిందే కానీ ఆ విషయాన్ని పెద్దది చేయలేదట.
అసలు విషయానికి వస్తే తన ఖుషి సినిమా ప్రమోషన్స్ ఇండియాలో పూర్తి చేసిన తర్వాత సమంత అమెరికా వెళ్లారు. నిజానికి చికిత్స నిమిత్తం ఆమె అమెరికా వెళ్లారు. కాగా, పనిలో పనిగా ఆమెను మూవీ టీమ్ ప్రమోషన్స్ చేయమని కోరారు. దీంతో, అమెరికాలో ఉన్న ఇండియన్స్ తో గ్రీట్, మీట్ ఈవెంట్ లో పాల్గొన్నారు సమంత. అంతేకాదు ఈ ఈవెంట్ లో పాల్గొన్నందుకు సమంతకు 25వేల డాలర్లు చెల్లించారు.
అయితే ఈ ప్రోగ్రాం లో ఈ హీరోయిన్ దాదాపు రెండు గంటలు పాల్గొనాల్సి ఉండగా సమంత మాత్రం. కేవలం గంటన్నర ప్రోగ్రామ్ లో ఉండి, ఆ తర్వాత వెళ్లిపోయిందట. ఇక, సమంత లగేజ్ బాధ్యత అంతా ఆమె మేనేజర్ తీసుకున్నారు. సమంత కారు వెనక ఈ లగేజ్ ఉన్న కారు వెళ్లాల్సి ఉండగా, దానిని ఈవెంట్ ఆర్గనైజర్లు దాదాపు గంటపాటు నిలిపివేశారట.
అంతేకాదు సమంత వెళ్తున్న కారు డ్రైవర్ కి ఫోన్ చేసిన ఈవెంట్ మేనేజర్ ఆమెను ఓ బూతు పదంతో తిట్టాడట. ఆ సమయంలో కారులో బ్లూటూత్ ఆన్ లో ఉండటంతో, ఆ మాట సమంత చెవిన కూడా పడింది. ఇక ఆ మాట వినగానే సమంత చాలా బాధపడినట్లు తెలుస్తోంది. అయినా కూడా, ఆ విషషయంలో ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమచారం.
మొత్తానికి ఎందుకు ఆ మనిషిని ఇబ్బంది పెట్టడం అనుకుందో ఏమో తెలియదు కానీ సమంత మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేయకూడదు అనుకుని తనలో తానే బాధపడిందంట.
