Anasuya Bharadwaj: అనసూయ ఇక బుల్లితెరకు రానట్లే. ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. వేటకూరకు అలవాటు పడ్డాక తోట కూర ఎవరు తింటారు చెప్పండి. అనసూయ తీరు అలానే ఉంది, కోట్లు తెచ్చిపెట్టే సినిమాలు ఉండగా గొంతు చించుకునే యాంకరింగ్ ఎందుకని ఫిక్స్ అయ్యింది. అయితే అనసూయ రాను రాను బ్యాడ్ గర్ల్ గా తయారవుతున్నారు. బ్యాడ్ గర్ల్ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఆమె రియల్ లైఫ్ బ్యాడ్ గర్ల్ కాదు. రీల్ లైఫ్ లైఫ్ బ్యాడ్ గర్ల్ అన్నమాట. ఈ మధ్య అనసూయ నటించిన చాలా పాత్రలు నెగిటివ్ షేడ్స్ కలిగి ఉన్నాయి.

Anasuya Bharadwaj
పుష్ప లో దాక్షాయణిగా రెడ్ శాండిల్ స్మగ్లర్ భార్య రోల్ చేశారు. మంచం మీదెక్కి మొగుడు పీక కోసేంత కసితో కూడిన పాత్ర పుష్పలో ఆమె చేశారు. అనసూయ డీగ్లామర్ లుక్ ఫ్యాన్స్ కి సరికొత్తగా తోచింది. అసలు ఆమె ఈమేనా అన్నంతగా పుష్పలో ఆమె అవతారం ఉంటుంది. దర్జా సినిమాలో కూడా అదే తీరు. జనాన్ని భయపెట్టే లేడీ గ్యాంగ్ స్టర్ రోల్ చేసింది అనసూయ. సునీల్ మరో కీలక చేశారు. దర్జా లో కూడా ఆమెది బ్యాడ్ రోలె.
రవితేజ ఖిలాడిలో అనసూయ ట్రాన్స్ఫర్మేషన్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అగ్రహారం ఆంటీ టు కన్నింగ్ లేడీగా ఆల్ట్రా మోడ్రన్ లుక్ ఊహించని షాక్ ఇచ్చింది. షార్ట్ ఫ్రాక్ వేసి రవితేజ క్రైమ్ పార్టనర్ గా కిరాక్ తెప్పించింది. ఖిలాడి మూవీలో సైతం ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే. తాజాగా మైఖేల్ మూవీ టీజర్ విడుదలైంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ సీరియల్ రోల్ చేస్తున్నారు. ఆమెది నెగిటివ్ రోలే అని విశ్వసనీయ సమాచారం. ఎటూ పుష్ప 2 దాక్షాయణిగా మరోసారి కరుడుగట్టిన లేడీ విలన్ గా అలరించనుంది.

Anasuya Bharadwaj
అనసూయకు మేకర్స్ ప్రత్యేకంగా విలన్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ ని బీట్ చేసి పూర్తి స్థాయి విలన్ గా సెటిల్ అవుతుందనిపిస్తుంది. కాగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె దేవదాసిగా కనిపించనున్నారట. రంగమార్తాండ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది.