Samantha Shakuntalam: సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా సుమారు దశాబ్దం నుండి కొనసాగుతున్న హీరోయిన్ సమంత..నటన లో ఈమె చూపించే రేంజ్ వైవిద్యం ఏ స్టార్ హీరోయిన్ కూడా చూపించలేదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసే అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు..గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం పెద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

Samantha Shakuntalam
ఆ సినిమా తర్వాత ఆమె ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం లో ‘శాకుంతలం’ అనే సినిమా చేసింది..ఈ చిత్రం వచ్చే నెల 17 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ ప్రేమకావ్యం ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి ఎంతో భారీగా ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు డైరెక్టర్ గుణశేఖర్.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది..పాన్ ఇండియన్ లెవెల్ లో భారీ స్కేల్ లో తీసిన ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము..ఈ చిత్రం లో సమంత వేసుకున్న నగలు మరియు దుస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Samantha Shakuntalam
ఈ సినిమాలో వాడే నగలు అప్పట్లో నగలు ఎలా ఉండేవో అలా రియాలిటీ కి దగ్గర ఉండేట్టు ఉండడం తో హైదరాబాద్ కి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ చేత 95 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి చేయించాడట డైరెక్టర్ గుణ శేఖర్..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అంతే కాదు ఈ సినిమాలో సమంత ధరించిన చీర కూడా 30 కిలోల బరువు ఉంటుందట..పురాణాలు ప్రకారం శకుంతల ఆరోజుల్లో ఇంత బరువైన వస్త్రాలనే ధరించేవారట..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం..అభిమానులను ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.