
pawan kalyan, jagan
Janasena Vs YCP: అధికార పార్టీకి ఆ జిల్లాల్లో గడ్డుకాలం దాపురించింది. కార్యకర్తల్లో అసంతృప్తి రగులుతోంది. ప్రతిపక్షం వైపు అసంతృప్త నేతల చూపు పడింది. ఆ జిల్లాల్లో అధికార పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నికల నాటికి ఎవరు ఉంటారో.. ఎవరు ఊడుతారో తెలియని సందిగ్ధత ఏర్పడింది. ప్రతిపక్షం రోజురోజుకూ బలపడుతోంది. ప్రతిపక్షం దెబ్బకు అధికార పార్టీ కుదేలవుతోంది. ఇంతకీ ఆ జిల్లాలేంటో .. ఆ పార్టీల కథేంటో చదివేయండి.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు రాజకీయంగా విశేష ప్రాధాన్యం ఉంది. ఆ జిల్లాల ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆనవాయితీ ఉంది. 2014లో ఉమ్మడి గోదావరి జిల్లాలు టీడీపీకి మెజార్టీని ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019లో వైసీపీకి మెజార్టీ ఇచ్చారు. వైసీపీ ఏపీలో అధికారం సాధించింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ అధికార వైసీపీ భయపెడుతోంది. వైసీపీలో నెలకొన్న అంతర్గత విబేధాలు పార్టీని రచ్చకీడుస్తున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టుకోల్పోతే ప్రమదం తప్పదనే సంకేతాలు వైసీపీలో కనిపిస్తున్నాయి.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ తర్వాత జనసేన మంచి ఓటు బ్యాంకు సాధించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కు రెండు జిల్లాల్లో గణనీయమైన ఆదరణ ఉంది. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన రెండో స్థానంలో నిలిచింది. టీడీపీని మూడో స్థానంలోకి నెట్టింది. ఇప్పుడు వైసీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు జనసేనకు కలిసొస్తున్నాయి. ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్నారు. చాప కింద నీరులా జనసేన విస్తరిస్తోంది. ఇప్పటికే కాకినాడ రూరల్ లోని సర్పవరం ఆలయ కమిటీ చైర్మన్, ఆయన సతీమణి వైసీపీకి రాజీనామా చేశారు. ఇలాంటి వారు మరెంతో మంది ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్యకర్తల వరకు జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరందరూ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

Janasena Vs YCP
వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా, టీడీపీతో కలిసి పోటీచేసినా తిరుగులేని మెజార్టీ సాధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ గుబులుకు ఇదే కారణమవుతోంది. జగన్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనుక కూడా ఇదే కారణం ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తే ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండనే ఉంది. దీంతో వైసీపీలో వణుకు పుడుతోంది. అందుకే జనసేన, టీడీపీ పొత్తుల పై తెగ భయపడుతోంది. జనసేనానిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తోంది. జనసేన దెబ్బకు అధికార వైసీపీ కుదేలవుతోందని చెప్పవచ్చు.