Catherine Tresa: కేథరిన్ థ్రెసాకి కాలం కలిసి రాలేదు గానీ, ఆమె స్టార్ హీరోయిన్ మెటీరియల్. కానీ.. బ్యాడ్ టైమ్.. స్టార్ అవ్వడానికి ముందే ఫేడ్ అవుట్ అయ్యిపోయింది. పైగా అమ్మడు వయసు 33. ఇంకో రెండేళ్లల్లో ముదురు భామల లిస్ట్ లో చేరిపోతుంది. ఈ రెండేళ్లలోనే ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది.

Catherine Tresa
అందుకే, ఏ అవకాశం వచ్చినా కేథరిన్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎలాగూ కెరీర్ ఎండింగ్ కి వచ్చింది కాబట్టి.. తాజాగా మరో సినిమా ఒప్పుకుంది. అయితే, ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ కాదు, విలన్. ఓ లేడీ విలన్ పాత్రలో కేథరిన్ కనిపించబోతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా ఫైనల్ అయ్యింది.
Also Read: Aishwarya Rai: ప్రతీకారానికి అందమైన రూపమే ఐశ్వర్య రాయ్
ఈ సినిమాలోనే కేథరిన్ విలన్ గా నటించబోతుంది. ఈ సినిమా రచయిత మచ్చ రవి ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రను కేథరిన్ కోసం డిజైన్ చేశాడట. ఈ పాత్రకు కేథరిన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని దర్శకుడు ఆమెను తీసుకున్నాడు. క్యారెక్టర్ కొంచెం బోల్డ్ గా ఉంటుందట. పైగా కొన్ని సన్నివేశాల్లో సెమీ న్యూడ్ గా నటించాల్సి వస్తోందట.

Catherine Tresa
అయితే, కేథరిన్ ఎలాంటి షరతులు పెట్టకుండా క్యారెక్టర్ చేయడానికి అంగీకరించింది. మొత్తానికి కేథరిన్ లిస్ట్ లో మరో వైవిధ్యమైన పాత్ర పడబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందట.
ఏది ఏమైనా కేథరిన్ మాత్రం తన దగ్గరకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదు. కెరీర్ చివరి దశలో ఉంది. ఈ లోపు మళ్ళీ సాధ్యమైనంత వరకు సంపాదించుకోవాలి. ఈ క్రమంలోనే ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించడానికి కేథరిన్ ఆసక్తి కనబరుస్తోంది. అలాగే చిన్నాచితకా సినిమాలను కూడా చేస్తోంది. మొత్తానికి కేథరిన్ ఎవరిని వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తోంది.