Pawan Kalyan Bro Movie: ‘బ్రో ది అవతార్’ చిత్రానికి మొదలైన ఇక్కట్లు..తీవ్రమైన నిషేధాలు విధించడానికి సిద్దమైన ప్రభుత్వం!
పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో కనిపించేది కేవలం 45 నిముషాలు మాత్రమే అని తెలిసినా కూడా బయ్యర్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ కొంటున్నారు. ప్రతీ ప్రాంతంలోను హైర్స్ కూడా ఊహించని రేంజ్ లో పెట్ట్టాడానికి బయ్యర్స్ సిద్ధం గా ఉన్నారు. కాని రీసెంట్ సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణం గా ఈ సినిమా బిజినెస్ కాస్త తగ్గే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Pawan Kalyan Bro Movie: సరిగ్గా 15 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి మరియు నాలుగు రోజుల క్రితం విడుదలైన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా వ్యాప్తంగా వంద కోట్ల రూపాయిల రేంజ్ లో జరిగింది.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో కనిపించేది కేవలం 45 నిముషాలు మాత్రమే అని తెలిసినా కూడా బయ్యర్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ కొంటున్నారు. ప్రతీ ప్రాంతంలోను హైర్స్ కూడా ఊహించని రేంజ్ లో పెట్ట్టాడానికి బయ్యర్స్ సిద్ధం గా ఉన్నారు. కాని రీసెంట్ సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణం గా ఈ సినిమా బిజినెస్ కాస్త తగ్గే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూలాలు కూడా కదిలించే విధంగా ముందుకు దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గా మొన్న ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన కొన్ని కామెంట్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ.
ఇలాంటి పొలిటికల్ హీట్ నేపథ్యం లో రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ లు చేయలేమని, గతం లో వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ చిత్రాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా తొక్కేయడం వల్ల మేము చాలా నష్టపోయామని, అందుకే ఇప్పుడు రిస్క్ చేయలేమని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వైసీపీ పార్టీ పై సోషల్ మీడియా లో చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.