India Vs West Indies 1st Test: భవిష్యత్తు కోసమే భారత్ – వెస్టిండీస్ జట్ల పోరాటం..
ఇరు జట్లు టెస్ట్ సిరీస్ ను కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. బుధవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ ద్వారా ఇరు జట్లలోను పలువురు యువ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఇరు జట్లలోను ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లు బరిలోకి దిగే అతికొద్ది మ్యాచ్ ల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

India Vs West Indies 1st Test: భారత్, వెస్టిండీస్ జట్లు మూడు ఫార్మాట్లలో సమరానికి సిద్ధమవుతున్నాయి. తొలుత రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇరుజట్లు మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా ఈ సిరీస్ ను వినియోగించుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విమర్శల జడివాన నుంచి తప్పించుకోవడంతోపాటు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం భారత జట్టుకు ఏర్పడింది. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు కూడా సంకట స్థితిని ఎదుర్కొంటోంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడిపోవడం ద్వారా అసలు వరల్డ్ కప్ మ్యాచ్ లకే అర్హత సాధించలేకపోయింది వెస్టిండీస్ జట్టు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ జట్టుపై కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంది. దీంతో వెస్టిండీస్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా జట్టులో పూర్తిగా మార్పులు చేసింది. యువకులతో కూడిన జట్టును భారత పర్యటనకు బరిలోకి దించుతుంది. ఇరు జట్లు కూడా మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా అడుగులను ఈ సిరీస్ ద్వారా ముందుకు వేస్తున్నాయి.
ఇరు జట్లు టెస్ట్ సిరీస్ ను కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. బుధవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ ద్వారా ఇరు జట్లలోను పలువురు యువ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఇరు జట్లలోను ఎక్కువ మంది కొత్త ఆటగాళ్లు బరిలోకి దిగే అతికొద్ది మ్యాచ్ ల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ భవిష్యత్తు క్రికెట్ ను దృష్టిలో పెట్టుకుని మార్పు దిశగా అడుగులు వేస్తుంటే.. వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ క్వాలిఫైయర్ లో ఎదురైన ఓటముల నుంచి గుణ పాఠాలు నేర్చుకుని బలమైన జట్టును నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ రెండు జట్లు ఈ సిరీస్ ను ముఖ్యమైనదిగా భావిస్తున్నాయి.
సత్తా చూపేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లు..
ఈ సిరీస్ ద్వారా అవకాశాలు అందిపుచ్చుకున్న ఎంతోమంది ఆటగాళ్లు తమ సత్తాను చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టెస్టులో భారత్ తరపున యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా, వెస్టిండీస్ జట్టు తరఫున అలీక్ అథానాజ్ బ్యాటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అజింక్య రహానే వైస్ కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు. ఈ సిరీస్ లో మెరుగైన పరుగులు చేయడం ద్వారానే స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించాడు. వెస్టిండీస్ జట్టులో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో చోటు దక్కించుకున్నాడు రాహ్కీమ్ కార్న్వాల్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల రాహ్కీమ్ బ్యాటింగ్ లోను సత్తా చాటాల్సిన అవసరం ఉంది. 9 టెస్టుల్లో 18 యావరేజ్ తో మాత్రమే ఇప్పటి వరకు పరుగులు చేశాడు. 2002 నుంచి జట్టు ఒక్క టెస్ట్ సిరీస్ లో కూడా భారత జట్టును ఓడించలేదు. ఈ రికార్డును మార్చాలన్న దృఢ సంకల్పంతో యువ వెస్టిండీస్ చుట్టూ సిద్ధమవుతోంది.
రోహిత్ శర్మకు అత్యంత కీలకమైన టూర్..
ఇక భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు కీలకమైన సిరీస్ గా మారింది.
రోహిత్ శర్మ ఇప్పటికీ టి20 క్రికెట్ కు దూరమైనట్లు తెలుస్తోంది. రాబోయే వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఎలా రాణిస్తుందో అన్నదానికి ముందస్తు సిరీస్ గా దీన్ని భావిస్తున్నారు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో రోహిత్ శర్మ ఎంత కాలం కొనసాగాలో నిర్ణయించే సిరీస్ గా దీనిని చాలామంది పేర్కొంటున్నారు. కాబట్టి ఈ సిరీస్ లో మెరుగైన విజయాలు సాధించడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం కూడా రోహిత్ శర్మకు దక్కుతుంది. ఓపెనింగ్ బ్యాటర్ గా రోహిత్ బలమైన పునాదులను వేసుకునేందుకు అనుగుణంగా ఈ సిరీస్ దోహదపడుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇక వెస్టిండీస్ జట్టు తరఫున నరేన్ చంద్రపాల్ కూడా సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియన్ బౌలింగ్ దాడిని తట్టుకుని మరీ ఈ యంగ్ ప్లేయర్ రాణించాడు. భారత్ తో మ్యాచ్ లోను అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నేర్చుకున్న అనుభవాన్ని భారత్ తో సిరీస్ లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే సుబ్ మన్ గిల్ కూడా అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
