Kamlabai: అవి 1908వ సంవత్సరం.. సురభి నాటక సంస్థ వారు గుంటూరులో నాటక ప్రదర్శనలు ఇస్తుండగా, అందులో ప్రముఖ పాత్ర ధరించిన నటికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. తప్పక ఇక తెర దించారు. చివరకు ఆ స్టేజ్ పైనే ఆ నటి ఓ ఆడబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ ఆ తర్వాత తెలుగు నాటక సినీ రంగ చరిత్రలో ప్రముఖ స్థానం పొందిన కమలాబాయి కావడం విశేషం.

Kamlabai
ఈ తరం వారికి అసలు ‘కమలాబాయి’ అంటేనే తెలియకపోవచ్చు. కానీ ఆమె తొలి తెలుగు హీరోయిన్, ”భక్తప్రహ్లాదా”లో హీరోయిన్ లీలావతి పాత్రకు ప్రాణం పోసిన తెలుగు అలనాటి మేటి నటి ఆమె. సహజనటిగా సురభి కమలాబాయికి గొప్ప పేరు ఉంది. అలాగే నాట్యకళలో, గానంలో ఆరితేరిన కమలాబాయికి అప్పట్లో తెలుగు నాట ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
నాటక సినీరంగ నటిగా బహుశా కమలాబాయి పొందిన రజిత, స్వర్ణ పతకాలు మరెవరూ పొందలేదు. అన్నిటికి మించి ఆమె మధుర గాయని, అలాగే ఆమె హార్మోనియం, సారంగి, వయోలిన్ వాయిద్యాలను, తన నెాపుణ్యంతో అద్భుతంగా పలికించేది. ”హోరి భగవంతుడ ఓ కొడుకుని ఇమ్మంటే ఇటువంటి రాక్షసుణ్ణి ఇచ్చావేమిటి” అంటూ పాతాళ భైరవిలో తోటరాముడ్ని విసుక్కున తల్లిగా నటించి, చిరస్థాయిగా నిలిచిపోయింది.
Also Read: మహేష్ పై ప్రేమను చాటునుకున్న ‘జూ.ఎన్టీఆర్’.. ఊహించని కామెంట్ చేసిన శ్రీరెడ్డి.. వైరల్..!
1953లో వచ్చిన ‘అమ్మలక్కలు’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. కమలాబాయి కొన్ని హిందీ చిత్రాలలో కూడ నటించారు. కమలాబాయిని ఆంధ్ర నాటక కళాపరిషత్తు వారు ఏలూరులో ఘనంగా సత్కరించారు. అక్కడే ఆమె తన 63వ యేట 1971లో కాలధర్మం చెందారు. అయితే ఆమె కూడా చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు.
కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని అప్పట్లో ఓ ప్రముఖ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అయితే, ఆ బ్యాంకు దివాళా తీసి, ఆమె తన డబ్బు మొత్తాన్ని కోల్పోయింది. దాంతో చివరి దశలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దానికి తోడు వయసు మీద పడి ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. ఆ సమయంలో ఆమెకు ఎన్టీఆర్ గారు సాయం చేశారట.
Also Read: మహేష్ బాబుకు కరోనా పాజిటివ్.. అభిమానుల్లో ఆందోళన