CM Jagan: జగన్ ను వెంటాడుతున్న ఆ భయం
రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లతో పాటు పదుల సంఖ్యలో మునిసిపాల్టీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. కొన్నింటికీ కోర్టు కేసులు క్లీయరెన్స్ అయినా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జాప్యం చేస్తూ వస్తోంది. గత కొన్నాళ్లుగా వీటికి ప్రత్యేకాధికారులను నియమించారు.

CM Jagan: ఎన్నికలు.. ఈ మాట వింటేనే జగన్ సర్కారు తెగ భయపడుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో బొమ్మ కనిపించింది. అనవసరంగా పట్టభద్రుల స్థానాల్లో పోటీకి దిగామని నాలుక కరుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మునిసిపాల్టీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా..ఆ సాహసానికి దిగడం లేదు. మనకెందుకొచ్చింది గొడవలే అంటూ పట్టించుకోవడం లేదు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ముందుకు రావడం లేదు. ఒక వేళ ఎన్నికలు నిర్వహించి.. ప్రతికూల ఫలితాలు వస్తే అసలుకే మోసం వస్తుందని జగన్ కు తెలుసు. అందుకే అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు.
రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లతో పాటు పదుల సంఖ్యలో మునిసిపాల్టీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. కొన్నింటికీ కోర్టు కేసులు క్లీయరెన్స్ అయినా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జాప్యం చేస్తూ వస్తోంది. గత కొన్నాళ్లుగా వీటికి ప్రత్యేకాధికారులను నియమించారు. వారి ఆధ్వర్యంలోనే పాలనా ప్రక్రియ సాగుతోంది. అయితే వారి పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది దీంతో మరో ఆరు నెలల పాటు ఎన్నికలు లేనట్టే. ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం కొంచెం అతి చేసింది. గతంలో ప్రజా సంఘాలు , వామపక్షాలు మాత్రమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసేవి. కానీ మొత్తం శాసనమండలిని వైసీపీ ప్రతినిధులతో నింపేయ్యాలని భావించిన జగన్ పార్టీ అభ్యర్థులంటూ అధికారికంగా బరిలో దింపారు. కానీ వారిని గెలిపించుకోలేకపోయారు. అప్పటివరకూ తనకు తిరుగులేదని భావించిన ఆయనకు పట్టభద్రులు వాత పెట్టారు. అప్పటి నుంచి వైసీపీ సర్కారుపై అనుమానపు ముద్రలు ప్రారంభమయ్యాయి. ప్రతికూలతలు మొదలయ్యాయి. అందుకే అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని డిసైడయ్యారు. ఖాళీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకూడదని భావించారు. విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన వెరవడం లేదు. ఓటింగ్ కు వెళ్లేందుకు సాహసించడం లేదు.
