Nayanthara: నయనతారపై ఫైర్ అయిన డైరెక్టర్, ఇక రావద్దంటూ వార్నింగ్!
నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలోనే విగ్నేష్-నయనతార ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్ల డేటింగ్ అనంతరం 2022లో వివాహం చేసుకున్నారు. నయనతారకు యాటిట్యూడ్ ఉండనే పేరుంది. ఎంత పెద్ద హీరో మూవీలో నటించినా ఆమె ప్రమోషన్స్ కి హాజరుకారు. ఆమెపై ఇది పెద్ద కంప్లైంట్ గా ఉంది.

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె పరిశ్రమను ఏలుతున్నారు. ఈ మలయాళ కుట్టికి చంద్రముఖి బ్రేక్ ఇచ్చింది. అనంతరం వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చి సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగింది. అందరిలానే కెరీర్ బిగినింగ్ లో నయనతార ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అవకాశాల కోసం బస్సుల్లో ఆఫీసుల చుట్టూ తిరిగేవారట. ఆడిషన్స్ ఇచ్చేవారట.
ఓ దర్శకుడు నయనతారకు అప్పట్లో వార్నింగ్ ఇచ్చాడంట. ఆమె చేసిన పని నచ్చక తీవ్రంగా మండిపడ్డాడట. కోలీవుడ్ కి చెందిన పార్తీబన్ నటుడు అలాగే దర్శకుడు. ఆయన తెరకెక్కించే ఓ సినిమాకు నయనతారను ఆడిషన్ కి పిలిచారట. ఉదయాన్నే 8 గంటలకు ఆడిషన్ కి రావాలని పార్తీబన్ నయనతారకు చెప్పాడట. ఆమె రాలేదట. ఫోన్ చేసి ఆడిషన్ కి ఎందుకు రాలేదని అడిగితే… సారీ సర్ నేను చెన్నై రాలేదు. రేపు రాత్రి 8 గంటలకు వస్తానని సమాధానం చెప్పిందట.
దాంతో చిర్రెత్తుకొచ్చిన పార్తీబన్ నువ్వు రావద్దు. రావాల్సిన అవసరం లేదని చెడామడా తిట్టేశాడట. ఈ విషయాన్ని పార్తీబన్ ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు. నయనతార స్టార్ అయ్యాక వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కింది. నానుమ్ రౌడీదాన్ మూవీలో పార్తీబన్ లోకల్ దాదా రోల్ చేశాడు. అతనిపై రివేంజ్ తీర్చుకునే అమ్మాయి పాత్ర నయనతార చేసింది. ఈ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకుడు.
నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలోనే విగ్నేష్-నయనతార ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్ల డేటింగ్ అనంతరం 2022లో వివాహం చేసుకున్నారు. నయనతారకు యాటిట్యూడ్ ఉండనే పేరుంది. ఎంత పెద్ద హీరో మూవీలో నటించినా ఆమె ప్రమోషన్స్ కి హాజరుకారు. ఆమెపై ఇది పెద్ద కంప్లైంట్ గా ఉంది. తెలుగులో టాప్ స్టార్స్ అందరితో నయనతార జతకట్టింది. నయనతార సరోగసీ పద్దతిలో ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది.
