HIT 2 Collections: అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2 ‘ అనే చిత్రం ఇదే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..థ్రిల్లర్ జానర్ లో మరో సూపర్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు అడవి శేష్..ఈ ఏడాది ప్రారంభం లో మేజర్ అనే సినిమాతో భారీ హిట్ ని అందుకున్న అడవి శేష్..ఇదే ఏడాది లో మరో సూపర్ హిట్ ని కొట్టి హీరో గా కెరీర్ లో ఒక మెట్టు ఎక్కాడు.

adivi sesh
ప్రస్తుతం బయ్యర్స్ లో అడవి శేష్ ఒక మినిమం గ్యారంటీ హీరో అనే పేరు ని తెచ్చుకున్నాడు..అయితే మొదటి మూడు రోజులు వచ్చిన భారీ ఓపెనింగ్స్ కి మరియు సోమవారం నాడు వచ్చిన కలెక్షన్స్ కి అసలు సంబంధమే లేదు..కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి..కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ వస్తాయి అనుకుకునే 90 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది.
ఇక మంగళవారం రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది..తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ ని అందుకుంది కానీ, కలెక్షన్స్ పరంగా మూవీ మరో రేంజ్ కి వెళ్తుందా అంటే..ప్రస్తుతానికి అనుమానమే..ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ మూవీ ఫుల్ రన్ 25 కోట్ల రూపాయిల షేర్ కి ముగుస్తుంది అనే విషయం అర్థం అవుతుంది..అడవి శేష్ హీరో గా నటించిన మేజర్ చిత్రానికి దాదాపుగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఆ చిత్రం వసూళ్లతో పోలిస్తే హిట్ 2 కి 10 కోట్ల రూపాయిలు తక్కువగా రాబోతుంది అన్నమాట.

adivi sesh
విశ్లేషకులు చెప్తున్న మాట ఏమిటి అంటే అడవి శేష్ ఒకే జానర్ సినిమాలకు పరిమితం అయిపోతున్నాడు..హీరో అన్న తర్వాత అన్ని రకాల జానర్స్ చెయ్యాలి..ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు, మాస్ సినిమాలు..ఫామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చెయ్యాలి..అప్పుడే స్టార్ హీరో రేంజ్ కి ఎదుగుతాడు..అడవి శేష్ లో స్టార్ హీరో అయ్యేంత కెపాసిటీ ఉంది..ఇక నుండైనా మేలుకోవాలి అని చెప్తున్నారు.