Movie Theatres: OTT వృద్ధిలోకి వచ్చిన తర్వాత థియేటర్స్ కి జనాలు వచ్చే సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని విశ్లేషకులు చెప్తూన్న మాట నిజమే..కరోనా మహమ్మారి సమయం లో లాక్ డౌన్ వల్ల జనాలు ఓటీటీ కి బాగా అలవాటు పడిపోయారు..దీనిని నివారించేందుకు ఓటీటీ లేట్ ఓటీటీ రిలీజ్ లు చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఓటీటీ కి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి కదలడానికి బద్దకిస్తున్నారు..#RRR , కేజీఎఫ్ , కాంతారా , బాహుబలి వంటి సినిమాటిక్ అనుభవం ని ఇచ్చే సినిమాలను తప్ప మీడియం రేంజ్ హీరోల సినిమాలు మాత్రం సరిగా ఆడడం లేదు.

Movie Theatres
పెద్ద హీరోల సినిమాలు సైతం మాములు కమర్షియల్ సినిమాలు కేవలం వీకెండ్స్ లో మాత్రమే బాగా ఆడుతున్నాయి..ఒక్కప్పటి లాగ నెలల తరబడి థియేటర్స్ లో సినిమాలు ఆడే రోజులు పొయ్యాయి..దీనితో థియేటర్ వ్యవస్థ ఎక్కడ పడిపోతుందో అని డిస్ట్రిబ్యూటర్స్ భయపడుతున్నారు..ఈ నేపథ్యం లో భారత దేశ ప్రభుత్వం ఒక సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టింది.
ఇక అసలు విషయానికి వస్తే CSC మరియు భారత దేశ ఎలక్ట్రానిక్స్ & ఐటీ మినిస్టర్ మధ్య ఒక సంచలనాత్మక ఒప్పదం జరిగింది..వచ్చే ఏడాది నుండి ఇండియా లోని రురల్ ప్రాంతాలు అన్ని కలిపి లక్షకి పైగా థియేటర్స్ ని నిర్మించాలని సంకల్పించారట..వచ్చే ఏడాది చివరి లోపు 1500 థియేటర్స్ మరియు 2024 వ సంవత్సరం లోపు 10000 థియేటర్స్ ని నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నారు అట..లక్ష థియేటర్స్ పూర్తి అయ్యే వరుకు ఈ పధకం కొనసాగనుంది అని తెలుస్తుంది..ఒక్కో థియేటర్ 100 నుండి 200 సీటింగ్ కెపాసిటీ కి తగ్గకుండా ఉండే విధంగా థియేటర్స్ ని నిర్మించబోతున్నారట.

Movie Theatres
ఒక్కో థియేటర్ కి సగటున 15 లక్షల రూపాయిల వరుకు ఖర్చు అవుతుందని సమాచారం..అత్యాధునిక టెక్నాలజీ తో పట్టణాల్లో ఉండే థియేటర్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ థియేటర్స్ ని నిర్మించబోతున్నారట..ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రోగ్రాం వల్ల థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందో లేదో చూడాలి.