TDP-Janasena : టీడీపీ, జనసేన పొత్తుకు అదే అడ్డంకి

టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిసి వస్తుందన్న టాక్ ప్రారంభమైంది. మొన్నటివరకూ ససేమిరా అన్నా.. బీజేపీ హైకమాండ్ పొత్తుల గురించి ఆలోచన చేస్తోందన్న టాక్ నడుస్తోంది.

  • Written By: Dharma
  • Published On:
TDP-Janasena : టీడీపీ, జనసేన పొత్తుకు అదే అడ్డంకి
TDP-Janasena : వచ్చే ఎన్నికల్లో పవన్ వ్యూహమేంటి? తరచూ చంద్రబాబుతో భేటీ కావడం దేనికి సంకేతం? అవి తేనీటి విందు భేటీలేనా? లేకుంటే వైసీపీ సర్కారును గద్దె దించేందుకు వ్యూహాలా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పుడు అసలు సిసలు సమయం వచ్చేసింది. ఇక పొత్తుల అంశం వెల్లడించే అనివార్య పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలు చూస్తే మరో ఏడాది కూడా లేవు. పొత్తులతో వెళ్లాలనుకుంటే ఇరు పార్టీ శ్రేణులకు మానసికంగా సిద్ధం చేయాల్సిన సమయమిది. కర్నాటక ఎన్నికల తరువాత బీజేపీ నుంచి వచ్చే సానుకూల సంకేతాలను బట్టి పొత్తుల కథకు  శుభారంభం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ముందస్తుగానే..
అయితే ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ముందుగానే మేల్కొన్నారు. క్షేత్రస్థాయిలో తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈ విషయంలో పవన్ చొరవే అధికమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పటం ఆవిర్భావ సభలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని పవన్ శపధం చేశారో.. అప్పటి నుంచే పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ విముక్త ఏపీయే తన ముందున్న లక్ష్యమని పవన్ ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని హెచ్చరించడం టీడీపీలో జవసత్వాలు నింపింది. జన సైనికుల్లో కసి పెరిగింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకత్వాలతో పనిలేకుండా రెండు పార్టీల శ్రేణులు పోటీచేసి మంచి ఫలితాలే సాధించాయి. దీంతో పొత్తుల అంశానికి మరింత బీజం పడింది.

పవర్ షేరింగే అడ్డంకి..
రెండు పార్టీల మధ్య పొత్తునకు అన్నీ సానుకూల అంశాలే ఉన్నాయి. ఒక్క సీఎం పదవి షేరింగ్ విషయం దగ్గరే ప్రతిష్టంభన నెలకొంది. అయితే ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉండడంతో ముందుగా వైసీపీని ఓడించాలన్న బలమైన లక్ష్యంతో ఇరు పార్టీల శ్రేణులు ఉన్నాయి. కానీ పవన్ కు ఇంతకంటే మంచి చాన్స్ రాదని.. సీఎం షేరింగ్ విషయంలో గట్టిగా ఉండాలని కాపు సంక్షేమ సంఘ నేతలు సూచిస్తున్నారు. ఆ మధ్యన కాపు వృద్ధ నేత హరిరామజోగయ్య సైతం ఇదే సలహా ఇచ్చారు. అయితే సీఎం పదవి షేరింగ్ విషయంలో ప్రతిష్ఠంభన తప్పదు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఏదో ఒక ఆలోచన చేస్తారని ఇరు పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.

కర్నాటక ఎన్నికల తరువాత
టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిసి వస్తుందన్న టాక్ ప్రారంభమైంది. మొన్నటివరకూ ససేమిరా అన్నా.. బీజేపీ హైకమాండ్ పొత్తుల గురించి ఆలోచన చేస్తోందన్న టాక్ నడుస్తోంది. ఈపాటికే చంద్రబాబు స్కెచ్ వేశారని.. ఆయన పాచిక వర్కవుట్ అవుతుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది. బీజేపీలో తనకు అనుకూలమైన టీమ్ తో ఎన్నిరకాలు చేయాలో.. చంద్రబాబు అన్నిరకాలు చేస్తున్నట్టు ప్రచారం అయితే ఉంది. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ నుంచి పొత్తుల అంశం వెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. అంటే ఈ నెలలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న మాట.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు