OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / లైఫ్‌స్టైల్ / Cruise Ship: అతిపెద్ద విహార నౌక.. తుక్కుగా మారేందుకే తొలి ప్రయాణం!

Cruise Ship: అతిపెద్ద విహార నౌక.. తుక్కుగా మారేందుకే తొలి ప్రయాణం!

Published by Raghava Rao Gara On Monday, 19 September 2022, 16:13

Cruise Ship: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక అది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుంది. ఆరుబయటి స్విమ్మింగ్‌ పూల్‌. విశాలమైన సినిమా థియేటర్‌ వంటి భారీ హంగులు ఉన్నాయి. అట్టహాసంగా నిర్మించిన దీనికి ‘గ్లోబల్‌ డ్రీమ్‌–2’ అని నామకరణం చేశారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలై తుక్కుగా మానపేంది.

Cruise Ship

Cruise Ship

జర్మన్‌–హాంకాంగ్‌ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్‌’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (భారత కరెన్సీలో సుమారు రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద ని«ధులు పూర్తిగా ఖర్చయిపోయాయి. తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్‌ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతధంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

తుక్కుగా అమ్మాలని నిర్ణయం..

నిధులు సమకూరకపోవడం, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ నౌకను, దీంతోపాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్‌ డ్రీమ్‌’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్‌ సంస్థ నిర్ణయించుకుంది.

ఇటీవలే తొలి విహార నౌక సర్వీస్‌ ప్రారంభం..

Cruise Ship

Cruise Ship

తొలి విహార నౌక సర్వీస్‌ ఇటీవలే ప్రారంభమైంది. సాగర నగరం విశాఖపట్నం నుంచే అండమాన్‌కు ఎంప్రెస్‌ కార్డిలియా అనే క్రూయిజ్‌ షిప్‌ ఈ జల విహారం ప్రారంభించింది. ప్రయాణికులను సముద్రంలో జలవిహారానికి తీసుకెళ్లే నౌకలను విహార నౌకలు.. క్రూయిజ్‌ షిప్పులు అంటుంటారు. ఇటువంటి నౌకా విహారాలు మనదేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్నాయి. కానీ విదేశాల్లో క్రూయిజ్‌ సర్వీసులు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. వేలమంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన నౌకలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో గ్లోబల్‌ డ్రీమ్‌ సర్వీస్‌ ప్రముఖమైనది. విషాదం ఏమిటంటే ఈ సంస్థ గ్లోబల్‌ డ్రీమ్స్‌–2 పేరుతో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌ షిప్‌ సర్వీస్‌ ప్రారంభించక ముందే మనుగడ కోల్పోవడం.

గ్లోబల్‌ డ్రీమ్‌–2 ప్రత్యేకతలు

ఆసియా ఖండానికి చెందిన డ్రీమ్‌ క్రూయిజస్‌ సంస్థకు గ్లోబల్‌ డ్రీమ్‌ పేరుతో ఇప్పటికే ఒక భారీ క్రూయిజ్‌ షిప్‌ ఉంది. నౌకా విహార సర్వీసులు నిర్వహించే ఈ సంస్థ గ్లోబల్‌ డ్రీమ్‌–2 పేరుతో మరో నౌక సమకూర్చుకోవాలని సంకల్పించింది. జర్మనీ బాల్టిక్‌ తీరంలో ఉన్న ఎంవీ వేర్ఫెన్‌ షిప్‌ యార్డులో ఈ నౌకా నిర్మాణం తుది దశలో ఉంది. దీని పొడవు 342 మీటర్లు, వెడల్పు 46.4 మీటర్లు, ఎత్తు 9.5 మీటర్లు, విద్యుదుత్పత్తి సామర్థ్యం 96 వేల కిలోవాట్లు. బరువు 2.08 లక్షల టన్నులు. ప్రపంచంలో అతిపెద్దవిగా గుర్తింపు పొందిన రాయల్‌ కరీబియన్‌ సంస్థకు చెందిన ఆయాసిస్‌ సిరీస్‌లోని ఐదు నౌకల తర్వాత ఆరో స్థానంలో గ్లోబల్‌ డ్రీమ్‌ నౌకలు నిలుస్తున్నాయి. అయితే నిర్మాణంలో ఉన్న డ్రీమ్‌–2 నౌకకు పెద్ద కష్టమే వచ్చి పడింది. జలవిహారానికి నోచుకోలేని దుస్థితి ఏర్పడింది.

కరోనాతో నిర్మాణ సంస్థ దివాలా..

కరోనా సంక్షోభం అన్ని రంగాల్లాగే క్రూయిజ్‌ సర్వీసులను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా జలవిహార బిజినెస్‌ పడిపోయింది. ఫలితంగా గ్లోబల్‌ డ్రీమ్, దాని మాతృసంస్థ జెంటింగ్‌ హాంకాంగ్‌
తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. దాంతో గ్లోబల్‌ డ్రీమ్‌ యాజమాన్యం ఈ ఏడాది జనవరిలోనే బ్యాంకుల్లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. నిర్మాణం తుది దశలో ఉన్న గ్లోబల్‌ డ్రీమ్‌–2 నౌకను అమ్మకానికి పెట్టింది. అయితే దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. గత్యంతరం లేక డ్రీమ్‌–2ను భాగాలుగా విడగొట్టి అమ్మేయాలని రుణ దాతలు నిర్ణయించారు. ఫలితంగా ఇంకా జలవిహారమే ప్రారంభించని ఈ అతిపెద్ద క్రూయిజ్‌ షిప్‌ తొలి ప్రయాణాన్నే స్క్రాప్‌ యార్డు వైపు సాగించనుంది. ఈ ఏడాది చివరిలోగా ఈ నౌకను షిప్‌ యార్డ్‌ నుంచి తరలించాలని నిర్ణయించారు.

లైఫ్ స్టైల్

Shikar Dhavan : ఆ తప్పుతో హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న శిఖర్ ధావన్..!

Bhadrachalam: ‘ద్వాదశ’ రామ.. రఘు కుల సోమ

Ticket Collector : టికెట్ కలెక్టరా మజాకా.. రూ.1.03 కోట్లు జరిమానాల వసూళ్లు

Pearl Millets : కొవ్వును తొలగించడంలో సజ్జలు ఎంతో ఉపయోగపడతాయి తెలుసా?

Romance : అనురక్షిత శృంగారం ఎంత ప్రమాదమో తెలుసా?

Benefits of Drinking Water: నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Dates : ఖర్జూరంతో ముస్లింలు ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా?

Onion : చెడు కొవ్వును కరిగించే ఉల్లిపాయ.. ఇలా తినాలి

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Tarakaratna Wife Alekhya Reddy: ఇల్లు లేక తారకరత్న కార్లలో నిద్రించిన రోజులు ఉన్నాయా..? వైరల్ అవుతున్న అలేఖ్య రెడ్డి కామెంట్స్

Aha Naa Pellanta: అప్పటి ముచ్చట్లు : అహనా పెళ్లంట.. 16 లక్షలతో సినిమా తీస్తే ఎంత వసూలైందో తెలుసా?

Kishore Kumar-Madhubala : మరణంతో ముగిసిన ప్రేమ… కిషోర్ కుమార్-మధుబాల బంధం ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ కావ్యం!

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Shikar Dhavan : ఆ తప్పుతో హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న శిఖర్ ధావన్..!

Allu Arjun Wife Snehareddy : పిచ్చెక్కిస్తున్న అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి వర్క్ అవుట్ వీడియో.. ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదా!

Hero Nani : హీరో నాని డ్రైవర్ గా కూడా పనిచేసాడా.. కన్నీళ్లు రప్పిస్తున్న లేటెస్ట్ కామెంట్స్

HBD Ram Charan : మెగాస్టార్ ఇంట్లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు.. పవన్ కళ్యాణ్ తో పాటుగా హాజరైన టాలీవుడ్ స్టార్ హీరోలు

HBD GlobalStar Ram Charan : రంగస్థలం పార్ట్-2కి ముహూర్తం ఫిక్స్.. పుట్టినరోజు నాడు చరణ్ ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్

Boyapati – Ram Pothineni Movie : బోయపాటి ప్లాన్ అదుర్స్… రామ్ పోతినేని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్డ్!

మరిన్ని చదవండి ...

గాసిప్

CM Jagan : ఉత్కంఠ : గవర్నర్ ను కలిసిన జగన్.. ముందస్తా? మంత్రివర్గ విస్తరణ..

KCR -Rahul Gandhi : నాటి బఫూన్‌.. నేడు బాహుబలి ఎలా అయ్యాడు చంద్రశేఖరా..?

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండతో ఒకే గదిలో సమంత… రష్మికకు బ్రేకప్ చెప్పి కొత్త ఎఫైర్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో!

Samantha – Naga Chaitanya :నాగ చైతన్య కారణంగా సమంతకు అబార్షన్, తిడుతూ కొడుతూ వేధించిన అక్కినేని హీరో!

Kavitha – KCR – KTR : ప్రగతిభవన్ కు కవిత.. హరీష్, కేటీఆర్ కూడా అక్కడే… ఏం జరుగుతోంది?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA : జూలై 7 నుంచి తానా 23వ మహాసభలు.. ప్రత్యేక అతిథిగా హాజరయ్యే ‘ధాజీ’ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

TANA Women’s Day : ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TANA Women’s day : ఉమెన్స్ డే : చికాగోలో “తానా”తరంగం.. తెలుగు ఆడపడుచుల పండగ వైభవం

Kaleshwaram: త్రివేణి సంగమం.. త్రిలింగ క్షేత్రం.. కాళేశ్వరం..!

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap