2018 Movie Oscar: బలగం చిత్రానికి షాక్… ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం!
ఇండియా నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీ కోసం బలగం చిత్రాన్ని పంపారు. కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో లోని ఆస్కార్ జ్యూరీ సభ్యులు బలగం చిత్రాన్ని ఎంపిక చేయలేదు.

2018 Movie Oscar: ఆస్కార్ అవార్డు బరిలో బలగం మూవీ నిలుస్తుందని టాలీవుడ్ ప్రముఖులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే నిరాశే ఎదురైంది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సంచలన విజయం సాధించింది. పిట్ట ముట్టుడు అనే ఆచారం చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్ అల్లి వేణు ఎమోషనల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. కమర్షియల్ సక్సెస్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు గెలుపొందింది. దీంతో బలగం ఆస్కార్ బరిలో నిలుస్తుందని పలువురు భావించారు.
ఇండియా నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీ కోసం బలగం చిత్రాన్ని పంపారు. కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో లోని ఆస్కార్ జ్యూరీ సభ్యులు బలగం చిత్రాన్ని ఎంపిక చేయలేదు. మలయాళ చిత్రం 2018కి ఆ అర్హత దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ కొరకు ఇండియా నుండి 2018 అనే చిత్రానికి అధికారిక ఎంట్రీ లభించింది. టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన 2018… కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కింది. ఆస్కార్ జ్యూరీని మెప్పించిన ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది.
2018 చిత్రానికి వేణు కున్నప్పిల్లి దర్శకత్వం వహించారు. ఆస్కార్ ఎంట్రీ దక్కడంతో 2018 చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు; ఇక టాలీవుడ్ నుండి బలగంతో పాటు దసరా చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపారు. నాని సినిమా కూడా ప్రభావం చూపలేదు.
గత ఏడాది గుజరాత్ కి చెందిన చెల్లో షో చిత్రాన్ని ఎంపిక చేశారు. అయితే చెల్లో షోకి అవార్డు దక్కలేదు. ఆర్ ఆర్ ఆర్ ని పంపాల్సిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఇతర మార్గాలు అన్వేషించి పోటీలో నిలిచారు. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే.
