Upendra-Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్ర మహేష్ కి తండ్రి పాత్ర అని తెలుస్తోంది. అయితే.. ఈ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నాడు. ఉపేంద్ర కన్నడలో సూపర్ స్టార్. అలాంటి హీరో.. అప్పుడే మహేష్ కి తండ్రిగా నటించడానికి ఎలా ఒప్పుకున్నాడు ? అని అందరూ డౌట్ పడుతున్నారు.

Upendra
అయితే, ఉపేంద్ర, మహేష్ సినిమా ఒప్పుకోవడానికి కారణం.. మహేష్ కి లైవ్ లో ఉపేంద్ర తండ్రిగా నటించడం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే ఉపేంద్ర తండ్రిగా కనిపిస్తాడు. అంటే.. మహేష్ చిన్నప్పటి పాత్రకు ఉపేంద్ర తండ్రిగా నటిస్తున్నాడు. మరి, త్రివిక్రమ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కి కూడా విలువ ఉంటుంది కాబట్టి.. ఉపేంద్ర కి పాత్ర బాగుంటుందేమో చూడాలి.

Upendra, Mahesh Babu
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఆగస్టు నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు.
పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట. ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు. అనిల్ కపూర్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీను తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నాడట.

Mahesh Trivikram
ఏది ఏమైనా త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాకు రూ. 200 కోట్లు మినిమం బడ్జెట్ అయిపోయింది. ఎలాగూ మహేష్ రెమ్యునరేషన్ రూ. 60 కోట్లు వరకు ఉంటుంది. మరోపక్క అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్ తో త్రివిక్రమ్ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేశాడు. ఈ లెక్కన సినిమాకి రూ.250 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.