Panja Movie : అప్పటి ముచ్చట్లు : పవన్ కళ్యాణ్ ‘పంజా’ మూవీ అందుకే ఫ్లాప్ అయ్యిందట!

కొమరం పులి, తీన్మార్ పరాజయాలతో సతమతవుతున్న పవన్ కు ఇది మరింత దెబ్బ కొట్టింది అని చెప్పాలి. ఈ సినిమా కథను తమిళ స్టార్ హీరో అజిత్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. తమిళ మార్క్ తో చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది.

  • Written By: Naresh
  • Published On:
Panja Movie : అప్పటి ముచ్చట్లు : పవన్ కళ్యాణ్ ‘పంజా’ మూవీ అందుకే ఫ్లాప్ అయ్యిందట!

Pawan Kalyan Panja Movie : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా తన సినిమాలు ప్లాఫ్ అవుతున్నా పవన్ చిత్రాలకు బిజినెస్, ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎప్పుడు తగ్గలేదు. అదీ పవర్ స్టార్ రేంజ్.. పవన్ వదులుకున్న సినిమాలను ఇతర హీరోలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. అయితే ఇతర హీరోలు వదులుకున్న సినిమాలు పవన్ చేతిలో పడగా ఆయన మాత్రం సక్సెస్ కొట్టలేదు.

ఓ హీరో తిరస్కరిచిన స్టోరీ తో మరో హీరో సూపర్ హిట్లు సంఘటనలు చాలా తక్కువ. అయితే పవర్ స్టార్ నటించిన ఓ చిత్రం విషయంలో ఇలాంటిదే జరిగింది. పవర్ స్టార్ కెరీర్ లో మరిచిపోలేని డిజాస్టర్ ను మూటగట్టుకున్న సినిమాల్లో పంజా మూవీ ఒకటి. ఈ సినిమా నిర్మాతలతో పాటు అభిమానులకు ఓ పీడకలలాంటిదే.

తమిళంలో స్టైలిష్, స్టార్ డైరెక్టర్ గా పేరొందిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పవన్ కు జోడిగా సారా జైన్, అంజలి లావనియా హీరోయిన్లుగా చేశారు. బాలీవుడ్ నటుడు జాకీష్ ష్రాఫ్, అడవి శేషుతో పాటు మరికొంతమంది కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్. బ్రహ్మనందంను పొగుడుతూ పాపారాయుడు ఇప్పటికీ గుర్తుంటుంది. ఈ పాటను పవన్ పాడారు. ఈ సినిమాలో పవన్ లుక్స్, గెటప్ కు వీపరితమైన రెస్పాన్స్ వచ్చింది. అంతకముందెప్పడు పవన్ పూర్తి గడ్డంతో కనిపించలేదు. ఈ చిత్రంలోనే మొదటి సారి గడ్డంతో కనిపించాడు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు క్రౌడ్ అంతా ఇంతా కాదు. ఆ రద్దీని దాటుకొని వేదిక మీదికి వెళ్లడానికి పవన్ కల్యాణ్ కు గంట సమయం పట్టిందంటే పవర్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. భారీ అంచనా మధ్య 2011 డిసెంబర్ 9న ఈ సినిమా రిలీజైంది.

అభిమానులు ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. మొదటి షో నుంచే ప్లాఫ్ అని కామెంట్స్ వచ్చాయి. పవర్ స్టార్ సినిమా తొలి షో నుంచేభారీ ప్లాఫ్ అని టాక్ వచ్చింది ఇదే తొలిసారి. కొమరం పులి, తీన్మార్ పరాజయాలతో సతమతవుతున్న పవన్ కు ఇది మరింత దెబ్బ కొట్టింది అని చెప్పాలి. ఈ సినిమా కథను తమిళ స్టార్ హీరో అజిత్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. విష్ణువర్ధన్. కథ విన్న తర్వాత నచ్చినప్పటికీ అప్పటికే కమిట్ అయిన సినిమాలతో అజిత్ బిజీగా ఉండడంతో అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాన్ ను సంప్రదించాడు. తమిళ మార్క్ తో చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది.

– శెనార్తి

సంబంధిత వార్తలు