Producer Danayya: అందుకే ఆస్కార్ కు వెళ్లలేదు.. విభేదాలపై నిర్మాత దానయ్య సంచలన కామెంట్స్
Producer Danayya: ఆస్కార్ అవార్డు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అభినందిస్తున్నారు. స్టార్ హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. అటు రాజమౌళి అస్కార్ కోసం చేసిన కృషిపై కీర్తిస్తున్నారు. సందట్లో సడేమియా లాగా ట్రిపుల్ ఆర్ పై కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ అనవసర చర్చకు దారి తీస్తున్నారు. […]


Producer Danayya
Producer Danayya: ఆస్కార్ అవార్డు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అభినందిస్తున్నారు. స్టార్ హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. అటు రాజమౌళి అస్కార్ కోసం చేసిన కృషిపై కీర్తిస్తున్నారు. సందట్లో సడేమియా లాగా ట్రిపుల్ ఆర్ పై కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తూ అనవసర చర్చకు దారి తీస్తున్నారు. ఆస్కార్ అవార్డు సందర్భంగా సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ న్యూయార్క్ లో కనిపించారు. కానీ నిర్మాత డివివి దానయ్య ఎక్కడా కనిపించలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆయన ఈ ఫంక్షన్ కు ఎందుకు వెళ్లలేదు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు చిరంజీవి పెట్టుబడులు పెట్టారని, ఆయనదే పైచేయి అని పోస్టులు పెట్టారు. దీనిపై దానయ్య అదిరిపోయే కౌంటర్ ఇస్తూ వార్నింగ్ ఇచ్చారు.
రాజమౌళి మదిలో నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీ టీం సంబరాలు చేసుకుంటోంది. డైరెక్టర్ రాజమౌళి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్స్ కాలభైరవ, సిప్లిగంజ్ లతో పాటు డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ లను పేరు పేరున ప్రశంసిస్తున్నారు. అయితే సినిమాకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఆస్కార్ రావడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, నిర్మాతకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రముఖ నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ టీం అమెరికాకు వెళ్లిన ఖర్చుతో 10 సినిమాలు తీయొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇదే తరుణంలో ఆస్కార్ అవార్డు సందర్భంగా నిర్మాత డివివి దానయ్య ఎక్కడా కనిపించలేదని కొందరు కొత్త చర్చకు దారి తీశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు నిర్మాత దానయ్య అయినప్పటికీ పెట్టుబడులు మొత్తం మెగాస్టార్ చిరంజీవి పెట్టారని, లాభం కూడా ఆయనే తీసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు పెట్టారు. దీనిపై దానయ్య తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి సున్నితంగా వార్నింగ్ ఇస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Producer Danayya
‘అసలు ఇలాంటి పోస్టులు పెట్టేవారికి మైండ్ ఉందా.. ఈ గాలి వార్తలను నేను పట్టించుకోను.. నేను ఆస్కార్ ఫంక్షన్ వెళ్లకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాని గురించి మీకెందుకు? నా సినిమాకు ఫైనాన్షియర్లు డబ్బులు పెడుతారు. చిరంజీవి పెట్టుబడులు పెట్టాలనుకుంటే సొంత సినిమాకు పెడుతారు. ఆయనకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎందుకు పెట్టుబడులు పెడుతారు. కామన్ సెన్స్ లేనివాళ్లే ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు. ఈ పుకార్లు సృష్టించిన వారు నా ఆఫీసుకు వచ్చారా? నా అకౌంట్స్ చెక్ చేశారా? మరోసారి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని కోరుకుంటున్నా..’ అని దానయ్య ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.