Hero Yash: కేజీఎఫ్ లాంటి బిగ్ హిట్ తర్వాత కూడా హీరో యష్ సినిమాలు చేయకపోవడానికి కారణం అదే…

ఇక ఈ క్రమంలో పూరి జగన్నాథ్ ఆయన తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పూరి రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 03:30 PM IST

Hero Yash: కన్నడ సినిమాలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో యశ్ ఒకడు. ఈయన కే జి ఎఫ్ సిరీస్ లతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన ఇప్పుడు ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి అనే దాని మీద ఒక వంతుకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే కన్నడ లో ఉన్న డైరెక్టర్లలో ఒకరు ఇద్దరిని మినహా ఇస్తే మిగతా ఎవరికి కూడా పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ అనే గుర్తింపు లేదు.ఇక ఇప్పటికే పాన్ ఇండియా హీరో గా ఎదిగిన యశ్ మళ్ళీ లోకల్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలంటే దానికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ క్రమంలో పూరి జగన్నాథ్ ఆయన తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పూరి రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది… ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే పూరి జగన్నాథ్ తనతో ఒక సినిమా చేస్తాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీ లో చాలా రోజుల నుంచి వినిపిస్తుంది… ఎందుకంటే యశ్ కి ఇప్పుడున్న టైం లో ఒక మంచి హిట్ కావాలంటే ఆయనకి తెలుగు డైరెక్టర్లు అయితేనే హిట్ ఇస్తారు అని ఆయన బాగా నమ్ముతున్నారు అందుకే ఆయన ఎక్కువ గా తెలుగు డైరెక్టర్లు చెప్పే కథలు మీదనే ఫోకస్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు పూరితో ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది.

ఇక వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా కి సంభందించిన స్టోరీ ని కూడా పూరి ఆల్రెడీ రెఢీ చేసి పెట్టినట్టు గా తెలుస్తుంది. అందుకే ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా మంచి అంచనాలు ఉన్నాయి ఇక డబల్ ఇస్మార్ట్ సినిమా అయిపోగానే ఈ సినిమా స్టార్ట్ చేసేలా ప్లాన్లు చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…