Odi World Cup 2023: టేబుల్ టాపర్ ఎవరో డిసైడ్ చేసేది ఆ ఒక్క మ్యాచే…
ఇప్పటివరకు సౌతాఫ్రికా టీం ఏడు మ్యాచ్ లు ఆడితే అందులో ఆఫ్గనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ఆరు మ్యాచ్ ల్లో విజయం సాధించి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఇప్పటికే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో నిన్నటి వరకు ఇండియన్ టీం నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగింది. కానీ రీసెంట్ గా సౌతాఫ్రికా టీం న్యూజిలాండ్ టీమ్ ని 190 రన్స్ తేడా తో ఓడించడం తో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇండియా ని వెనక్కి నెట్టి సౌతాఫ్రికా టీమ్ ముందుకు దూసుకెళ్లింది.ఇక ప్రస్తుతం ఈ రెండు టీంలు ఆరు మ్యాచులు గెలిచినప్పటికీ సౌతాఫ్రికా రన్ రేట్ మాత్రం కొంచెం మెరుగ్గా ఉంది. దాని వల్లనే సౌతాఫ్రికా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ కి వెళ్ళింది.ఇక ఈ లీగ్ మ్యాచులు ముగిసే సరికి ఈ రెండు టీముల్లో ఏదో ఒకటి పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో నిలిచే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు సౌతాఫ్రికా టీం ఏడు మ్యాచ్ లు ఆడితే అందులో ఆఫ్గనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ఆరు మ్యాచ్ ల్లో విజయం సాధించి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. అదేవిధంగా ఇండియన్ టీమ్ ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడితే అందులో 6 విజయాలను అందుకొని 12 పాయింట్ల తో నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది. అయితే సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో ఓడిపోయింది.కానీ ఇండియన్ టీమ్ ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. ఇక దాంతో లీగ్ మ్యాచ్ లు ముగిసే సరికి నెంబర్ వన్ పొజిషన్ లో ఎవరు కొనసాగుతారనే చర్చ ఇప్పుడు అందరిలో నెలకొంది. ఇక ఈ టీమ్ లు కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టీమ్ లకి ఫస్ట్ పొజిషన్ ను చేరుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ 2,3 మ్యాచ్ లు ఓడిపోయి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం నెంబర్ వన్ అనేది ఇండియా, సౌతాఫ్రికా మీదనే డిపెండ్ అయి ఉంటుంది…
ఈ సందర్భంలో ఇండియా సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 5 వ తేదీన జరగాల్సి ఉంది.ఈ మ్యాచ్ జరిగితే కానీ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఎవరు కొనసాగుతారు అనేది తెలియదు. ఇప్పటివరకు ఇండియా ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు కాబట్టి వరుసగా మూడు మ్యాచ్ లు గెలిస్తే ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది. సౌతాఫ్రికా మీద ఇండియా ఓడిపోతే మాత్రం నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగాల్సి ఉంటుంది.ఇక ఇప్పటికైతే సౌతాఫ్రికా టీమ్ మంచి ఫామ్ లో కనిపిస్తూ అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఇండియన్ టీం కూడా సౌతాఫ్రికా టీం కి ఎంత మాత్రం తక్కువ కాదు కాబట్టి ఈ లీగ్ మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా ఇండియా మ్యాచ్ కోసం అన్ని దేశాల అభిమానులు ఎదురు చూస్తున్నాయి… మరి ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది తెలియాలంటే మ్యాచ్ జరిగేంత వరకు ఎదురు చూడక తప్పదు…
