Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా మారడానికి కారణం అదేనట.?
Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా ఇండియన్ క్రికెట్ లో ఒక వెలుగు వెలుగుతున్న క్రీడాకారుడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను అదరగొడుతూ సత్తాను చాటుతున్నాడు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లోను టాప్ లో ఉన్న రవీంద్ర జడేజా ఇండియన్ క్రికెట్ లో అత్యంత కీలకమైన ప్లేయర్. తనదైన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేస్తూ.. అవసరమైనప్పుడు బ్యాటింగ్ లోను రాణిస్తూ జట్టును ఆదుకోవడం జడ్డు స్పెషాలిటీ. మోకాలు […]


Ravindra Jadeja
Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా ఇండియన్ క్రికెట్ లో ఒక వెలుగు వెలుగుతున్న క్రీడాకారుడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను అదరగొడుతూ సత్తాను చాటుతున్నాడు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లోను టాప్ లో ఉన్న రవీంద్ర జడేజా ఇండియన్ క్రికెట్ లో అత్యంత కీలకమైన ప్లేయర్. తనదైన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టేస్తూ.. అవసరమైనప్పుడు బ్యాటింగ్ లోను రాణిస్తూ జట్టును ఆదుకోవడం జడ్డు స్పెషాలిటీ. మోకాలు ఇచ్చేస్తా చికిత్స తర్వాత మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేసిన అతను.. వరుసగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఈ అవార్డు జడ్డుకే దక్కింది. ఆ తర్వాత జరిగిన మొదటి వన్డేలో కూడా జడ్డునే ఈ అవార్డు అందుకున్నాడు. 2009లో భారత్ తరపున అరంగేట్రం చేసిన జడేజా.. అప్పటినుంచి జట్టులో అత్యంత కీలక ఆటగాడు గా మారాడు. భారత తరఫున 64 టెస్టులు, 172 వన్డేలు, 64 t20 లు ఆడిన జడేజా, వీటిలో చాలాసార్లు భారత్ ను ఒంటి చేతితో గెలిపించాడు. ఇంత అద్భుతంగా ఆడుతున్న జడ్డు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించాడు.
ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకుని..
ఐపీఎల్ 2023 ప్రారంభానికి సన్నాహకంగా జరిగిన ఒక కార్యక్రమంలో రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. తను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. కానీ తన వద్ద దానికి సరిపడే ప్లేస్ లేకపోవడంతో వెనుకడుగు వేశానని గుర్తు చేసుకున్నాడు. ‘ నేను చాలా కాలం క్రితం క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్న. మిగతా ప్యాసర్లు బౌన్సర్లు వేయడం బాగా నచ్చేది. నేను కూడా అలాగే వేయాలని చాలా గట్టిగా అనుకునేవాడిని. కానీ నా దగ్గర ఫేస్ బౌలర్ అయ్యే వేగం లేదు’ అని జడేజా చెప్పుకొచ్చాడు.
క్రికెట్ జర్నీ పై ఇద్దరు మహేంద్రులు ప్రభావం..
ఈ సందర్భంగా మరిన్ని విషయాలు మాట్లాడిన రవీంద్ర జడేగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా తన క్రికెట్ ప్రయాణంలో ప్రభావం చూపించిన క్రీడాకారుల గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తన క్రికెట్ జర్నీని ఇద్దరు మహేంద్రులు బాగా ప్రభావితం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘ ఈ విషయం నేను ధోనీకి కూడా చెప్పా. జామ్ నగర్ లో నా కోచ్ మహేంద్రసింగ్ చౌహాన్ తో నా జర్నీ మొదలైంది. ఇప్పుడు సీఎస్కే లో మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీ లో సాగుతోంది. నా క్రికెట్ అంతా ఇలా ఇద్దరు మహేంద్రుల మధ్యనే సాగింది’ అని రవీంద్ర జడేజా పేర్కొన్నాడు.

Ravindra Jadeja
ధోని అండగా జడేజా..
ఇండియన్ క్రికెట్ లో రవీంద్ర జడేజా, సురేష్ రైనా వంటి ప్లేయర్లకు గొప్ప అవకాశాలు కల్పించిన కెప్టెన్ గా ధోని చరిత్రలో నిలిచిపోతాడు. అనేక సందర్భాల్లో వీళ్ళిద్దరూ ఆటలో ఫెయిల్ అయినప్పటికీ వీరికి మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారిలోని సామర్థ్యాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని ధోని చేశాడు. ఇదే విషయాన్ని తాజాగా రవీంద్ర జడేగా చెప్పడం గమనార్హం. తన క్రికెట్ జర్నీలో మహేంద్రసింగ్ ధోని ప్రభావం ఎనలేనిదని రవీంద్ర జడేజా ద్వారా ధోని గతంలో అందించిన సహాయ, సహకారాలను జడేజా బయటపెట్టినట్టు అయ్యింది.