Trisha: త్రిష పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఆ హీరోనేనా..!
Trisha: నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా చేతినిండా క్రేజీ మూవీస్ తో కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తుంది త్రిష.ఈమె ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం బాషలలో విడుదల కానుంది. ఈ సందర్భం గా మూవీ టీం మొత్తం హైదరాబాద్ లో ప్రొమోషన్స్ లో పాల్గొంది. హీరోయిన్ […]

Trisha: నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా చేతినిండా క్రేజీ మూవీస్ తో కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తుంది త్రిష.ఈమె ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం బాషలలో విడుదల కానుంది. ఈ సందర్భం గా మూవీ టీం మొత్తం హైదరాబాద్ లో ప్రొమోషన్స్ లో పాల్గొంది.
హీరోయిన్ త్రిష తో పాటుగా ఐశ్వర్య రాయి బచ్చన్, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లేక్ష్మి లతో పాటుగా హీరోలు కార్తీ, విక్రమ్ మరియు జయం రవి కూడా పాల్గొన్నారు.ఇంతమంది నటీనటులు ఉన్నా కూడా అందరి చూపు త్రిష మీదనే ఉంది. ఎందుకంటే ఆమె ఈ ఈవెంట్ లో అంత అందంగా కనిపించింది. బ్లూ చీర లో మహారాణిలాగా చూపులు తిప్పుకోలేని అందం తో మైమరపించింది త్రిష. ఈమెకి 40 సంవత్సరాల వయస్సు అంటే ఎవ్వరూ కూడా నమ్మరు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు.
ఇది ఇలా ఉండగా త్రిష కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటి అంటే ఈమెకి కొంతకాలం క్రితం ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మానియన్ తో నిశ్చితార్థం అయ్యింది. అయితే వరుణ్ మానియన్ మరియు తమిళ హీరో ధనుష్ మధ్య విబేధాలు మొదటి నుండి తారాస్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ త్రిష కి తెలిసి కూడా నిశ్చితార్ధ వేడుకకి ధనుష్ ని ఆహ్వానించింది.
దీనితో వరుణ్ కి పట్టరాని కోపం వచ్చింది,తన శత్రువు అని తెలిసి కూడా అతనిని నిశ్చితార్థం కి, పెళ్లి కి ఆహ్వానించినందుకు త్రిష పై మండిపడ్డాడట.అలా వాళ్ళిద్దరి మధ్య మాటా మాట పెరిగి పెద్ద గొడవకి దారి తీసింది. దీనితో త్రిష వరుణ్ తో జరిగిన నిశ్చితార్థం ని క్యాన్సిల్ చేసుకుంది. అప్పటి నుండి ఆమె సింగిల్ గానే ఉంటూ వచ్చింది, అలా త్రిష పెళ్లి ధనుష్ వాళ్ళ క్యాన్సిల్ అయ్యిందని కోలీవుడ్ లో ఎంతో కాలం నుండి సాగుతున్న చర్చ.
