Crores Money On Graveyard: శ్మశానంలో కోట్లు దాచిన ఆ ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీ.. ఐటీ దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు
Crores Money On Graveyard: అటు ఏపీ చూసినా.. ఇటు తెలంగాణ చూసినా.. కీలక ఇన్ ఫ్ట్రాస్టక్చర్ ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీయే చేపడుతోంది. లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆ కంపెనీ చేతుల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో ఆ ఇన్ ఫ్రా కంపెనీ అధినేతకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మీడియాను ఆయన బాగా మేనేజ్ చేస్తుంటాడు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ వార్తలు మీడియా, వెబ్ సైట్లలోనూ కనిపించవు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మూడు […]

Crores Money On Graveyard: అటు ఏపీ చూసినా.. ఇటు తెలంగాణ చూసినా.. కీలక ఇన్ ఫ్ట్రాస్టక్చర్ ప్రాజెక్టులన్నీ ఆ కంపెనీయే చేపడుతోంది. లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆ కంపెనీ చేతుల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో ఆ ఇన్ ఫ్రా కంపెనీ అధినేతకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక మీడియాను ఆయన బాగా మేనేజ్ చేస్తుంటాడు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ వార్తలు మీడియా, వెబ్ సైట్లలోనూ కనిపించవు.

Crores Money On Graveyard
ఇలా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆయన ఇన్ ఫ్రా వ్యాపారాన్ని సాగిస్తుంటారన్న పేరుంది. ప్రభుత్వాధినేతలు, అధికారులకు కూడా ఈయన బాగానే ముట్టజెప్పి తనకు కావాల్సిన అన్ని పనులు, ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారు.

Crores Money On Graveyard
అయితే ఇన్ ఫ్రా ప్రాజెక్టు అన్నాక వేలు, లక్షల కోట్లు డబ్బు వస్తుంటుంది. మరి అంత సంపాదన ఉన్న కంపెనీకి ఆదాయంపై భారీగానే పన్ను కట్టాలి. కానీ సదురు కంపెనీ తమ వద్ద పోగైన భారీ డబ్బును బ్లాక్ మనీగా మార్చేసి ఐటీ పన్ను కట్టకుండా రహస్యంగా దాచిపెట్టేసింది.
