Tarakaratna Heart Attack: సీనియర్ నిర్మాత చిట్టిబాబు తారకరత్న హెల్త్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తారకరత్నతో చిట్టిబాబుకు గట్టి అనుబంధం ఉంది. చిట్టిబాబును తారకరత్న బాబాయ్ అని పిలిచేవారట. ఇక తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురికావడానికి చెడు అలవాట్లు కూడా కారణమన్నారు. తారకరత్న సిగరెట్స్ ఎక్కువ తాగేవారు. నందమూరి కుటుంబంలో తారకరత్నకు ఈ వ్యసనం తీవ్ర స్థాయిలో ఉంది. కెరీర్, పర్సనల్ లైఫ్ లో ఎదురైన ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ గురించి ఆలోచిస్తూ సిగరెట్స్ తాగుతూ ఉండేవాడు. హీరోగా ఎదగలేకపోయానన్న అసహనం తారకరత్నలో ఉండేది. అలాగే పెళ్లి విషయంలో కూడా సంతృప్తి లేదు.

Tarakaratna
ప్రేమ పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ అంగీకరించలేదు. నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని బాధపడేవాడు. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ దమ్ము కొడుతూ ఉండేవాడు. కార్డియాక్ అరెస్ట్ కి ఇది ప్రధాన కారణం కావచ్చు. అయితే తారకరత్న కోలుకుంటున్నారు. బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. నారాయణ హృదయాలయ వైద్యులు గొప్ప నిపుణులు. దాదాపు చనిపోతారనుకున్న వాళ్ళను కూడా బ్రతికించిన హిస్టరీ వాళ్లకు ఉంది. కాబట్టి తారకరత్న తిరిగి కోలుకుంటారన్న నమ్మకం ఉందని చిట్టిబాబు తెలిపారు.
సోమవారం రాత్రి కూడా తారకరత్న కండీషన్ క్రిటికల్ గా ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. మాక్సిమమ్ లైఫ్ సప్పోర్ట్ సిస్టమ్స్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బులెటిన్ నందమూరి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే మంగళవారం ఉదయం ఆయన హెల్త్ మెరుగైందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తారకరత్న హెల్త్ పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ ఇంప్రూవ్మెంట్ గమనించారట. దీంతో తారకరత్న కోలుకుంటారన్న విశ్వాసం బలపడుతుంది.

Tarakaratna
గత ఐదు రోజులుగా తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఆదివారం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో పాటు తారకరత్నను సందర్శించారు. బాలయ్య అక్కడే ఉండి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. జనవరి 27 శుక్రవారం తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురై కుప్పకూలిపోయారు. స్థానిక ఆసుపత్రికి ఆయన్ని హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తీసుకెళ్లారు.