Thaman: మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుండి థమన్ అవుట్.. క్లారిటీ ఇచ్చిన థమన్!

కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ద్వారా ఈ అధికారిక ప్రకటన చేసారు. ఇందులో మహేష్ బాబు ఊర మాస్ లుక్స్ లో వెనుక వైపు నిలబడి నోట్లో బీడీ కాలుస్తున్న స్టిల్ ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది.

  • Written By: Vicky
  • Published On:
Thaman: మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుండి థమన్ అవుట్.. క్లారిటీ ఇచ్చిన థమన్!

Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా టైటిల్ ని ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన చెయ్యబోతున్నారు. గ్లిమ్స్ వీడియో కూడా ఆరోజే విడుదల కాబోతుంది.

కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ద్వారా ఈ అధికారిక ప్రకటన చేసారు. ఇందులో మహేష్ బాబు ఊర మాస్ లుక్స్ లో వెనుక వైపు నిలబడి నోట్లో బీడీ కాలుస్తున్న స్టిల్ ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇన్ని రోజులు మేము ఎలాంటి మహేష్ బాబు ని చూడాలని కోరుకున్నామో అలాంటి మహేష్ ని చూపిస్తున్నందుకు థాంక్స్ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కృతఙ్ఞతలు చెప్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ పోస్టర్ లో క్యాస్ట్ & క్రూ పేర్లు వేసినప్పుడు సంగీత దర్శకుడు థమన్ పేరు మిస్ అయ్యింది.

దీంతో ప్రముఖ వెబ్ సైట్స్ అన్నీ థమన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడా ? అంటూ కథనాలు ప్రచారం చేసాయి. ఈ సినిమా యూనిట్ కి సంబంధించిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టర్ ని సమయానికి విడుదల చెయ్యగా, థమన్ మాత్రం చెయ్యలేదు. దీంతో అనుమానం కాస్త రెట్టింపు అయ్యింది.

అయితే పోస్టర్ విడుదలైన అరగంట తర్వాత థమన్ పోస్టర్ వెయ్యడం తో తానూ ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వస్తున్న రూమర్స్ కి పరోక్షంగా చెక్ మేట్ పెట్టినట్టు అయ్యింది. కానీ థమన్ ప్రతీ హీరో సినిమా కి ఇలాగే విష్ చేస్తూ ఉంటాడు. అలా ఈ సినిమాకి కూడా ఆయన తప్పుకున్నప్పటికీ విష్ చేసి ఉండొచ్చు అని కొంతమంది ఫ్యాన్బ్స్ అంటున్నారు. మరి థమన్ ఈ చిత్రం లో భాగం అయ్యి ఉన్నాడా, లేదా అనేది ఆయనే స్పష్టంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు