Thaman- Devisreeprasad: థమన్-దేవిశ్రీ కెరీర్ ప్రశ్నార్థకం కానుందా? మేలుకోకపోతే!
ఇళయరాజా హవా మొదలయ్యాక అందరూ ఆయన వెనుక పడ్డారు. ఆయన ఫార్మ్ లో ఉన్నప్పుడే ఏ ఆర్ రెహమాన్ అనే సంచలనం రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఏ ఆర్ రెహమాన్ తెలుగు సినిమాకు పని చేసింది చాలా తక్కువ. దానికి బడ్జెట్ తో పాటు సెంటిమెంట్స్ కూడా కారణమయ్యాయి. వీరిద్దరినీ తట్టుకొని రాజ్ కోటి నిలబడ్డారు. ఈ సంగీత ద్వయం తిరుగులేని మ్యూజిక్ ఇచ్చారు. స్టార్ హీరోలకు కమర్షియల్ హిట్స్ కి కారణమయ్యారు. రాజ్ కోటి విడిపోయారు. అది వాళ్లకు మైనస్ అయ్యింది.

Thaman- Devisreeprasad: టాలీవుడ్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఎప్పటి నుండో ఉంది. ఈ విషయంలో కోలీవుడ్ మనకంటే ఓ మెట్టు పైన ఉంది. దశాబ్దాలుగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ మీదే తెలుగు సినిమా ఆధారపడింది. అప్పట్లో కేవీ మహదేవన్, తర్వాత ఇళయరాజా టాలీవుడ్ ని ఏలారు. అలా అని తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అసలు లేరని కాదు. తెలుగు సినిమా పరిశ్రమపై తమ ముద్ర వేసిన మన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కే చక్రవర్తి గొప్ప గొప్ప మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చారు.
ఇళయరాజా హవా మొదలయ్యాక అందరూ ఆయన వెనుక పడ్డారు. ఆయన ఫార్మ్ లో ఉన్నప్పుడే ఏ ఆర్ రెహమాన్ అనే సంచలనం రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఏ ఆర్ రెహమాన్ తెలుగు సినిమాకు పని చేసింది చాలా తక్కువ. దానికి బడ్జెట్ తో పాటు సెంటిమెంట్స్ కూడా కారణమయ్యాయి. వీరిద్దరినీ తట్టుకొని రాజ్ కోటి నిలబడ్డారు. ఈ సంగీత ద్వయం తిరుగులేని మ్యూజిక్ ఇచ్చారు. స్టార్ హీరోలకు కమర్షియల్ హిట్స్ కి కారణమయ్యారు. రాజ్ కోటి విడిపోయారు. అది వాళ్లకు మైనస్ అయ్యింది.
తర్వాత మణిశర్మ ప్రస్థానం మొదలైంది. బావగారు బాగున్నారా?, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి చిత్రాలతో ఆయన టాప్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఒక దశాబ్దం పాటు ఆయన ఏకఛత్రాధిపత్యం చేశాడు. ప్రతి స్టార్ హీరో సినిమాకు ఆయనే మ్యూజిక్ ఇచ్చాడు. మణిశర్మ దగ్గర పని చేసిన దేవిశ్రీ ప్రసాద్, థమన్ చిన్నగా ఎదగడం మొదలుపెట్టారు. మన్మథుడు సినిమాతో దేవిశ్రీ వెలుగులోకి వచ్చాడు. మణిశర్మకు పోటీ ఇస్తూ దేవిశ్రీ తన మార్క్ క్రియేట్ చేశాడు.
తర్వాత కిక్ మూవీతో థమన్ సంగీత ప్రియులను ఆకర్షించాడు. దేవిశ్రీ ఆదిపత్యం చాలా కాలం నడిచింది. మణిశర్మ ఒకప్పటి పదును కోల్పోవడంతో దేవిశ్రీకి కలిసొచ్చింది. మధ్యలో అనూప్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ ఆకట్టుకున్నా స్టార్స్ కాలేకపోయారు. స్థిరత్వం లేక వెనుకబడిపోయారు. దేవిశ్రీ-థమన్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు.
చెప్పాలంటే వీరిద్దరి మ్యూజిక్ లో కూడా పస లేదు. కొట్టిందే కొట్టి జనాలను విసిగించేస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కానీ సాంగ్స్ చాలా పూర్ గా ఉంటాయి. దేవిశ్రీ గత చిత్రాల్లోని అనేక పాటలు గుర్తొస్తాయి. థమన్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అల వైకుంఠపురంలో సాంగ్స్ ఆటం బాంబులా పేలాయి. ఆ దెబ్బతో నాలుగైదేళ్లకు సరిపడా సినిమాలు వచ్చిపడ్డాయి. తర్వాత ఆల్బమ్స్ మాత్రం ఆకట్టుకోలేదు. తరచుగా కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దర్శకులకు సైతం వీరిద్దరిలో జోరు తగ్గిందని అర్థం అవుతుంది. మరో ప్రత్యామ్నాయం లేకనే కానీ వీరి పట్ల హీరోలకు, దర్శకులకు ఆసక్తి లేదు. అందుకే తమిళ పరిశ్రమకు చెందిన అనిరుధ్, సంతోష్ నారాయణన్, జీవీ ప్రకాష్, జస్టిన్ ప్రభాకరన్ ల పట్ల మొగ్గు చూపుతున్నారు. వీరి కంటే గోపి సుందర్, భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, వివేక్ సాగర్ పర్లేదు అనిపిస్తున్నారు. ఇకనైనా దేవిశ్రీ, థమన్ మేల్కోకపోతే కెరీర్ ప్రశ్నార్థకం అవుతుంది.
