దళపతి విజయ్‌ సరసన ఆ క్రేజి భామ..!

                          ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. మలయాళ కుట్టి మాళవికమోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమలో ఆండ్రియా కీలక […]

  • Written By: Raghava
  • Published On:
దళపతి విజయ్‌ సరసన ఆ క్రేజి భామ..!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. మలయాళ కుట్టి మాళవికమోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమలో ఆండ్రియా కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమా తరువాత కొంగర సుధ దర్శకత్వంలో విజయ్, మరో సినిమాలో నటించబోతున్నాడు. గతంలో కొంగర సుధ వెంకటేష్ హీరోగా ‘గురు’ సినిమాను తెరకెక్కించింది.ఈ సినిమాలో విజయ్ సరసన క్రేజి భామ పూజా హెగ్డే నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విజయ్ 65వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను సన్ ఫిక్చర్స్‌ సంస్థ నిర్మించబోతోంది. సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు