Mahesh Shocking Decision:తెలుగు ఇండస్ట్రీకే షాక్.. మహేష్ షాకింగ్ నిర్ణయం !
Mahesh Shocking Decision: బాక్సాఫీస్ వద్ద ‘సర్కారు వారి పాట’ ప్లాప్ టాక్ కి మహేష్ బాగా అప్సెట్ అయ్యాడు. అయితే, ఈ విచారంలోనూ బయ్యర్లు విషయంలో మహేష్ పెద్ద మనసు చేసుకున్నాడు. తన సినిమా కారణంగా ఎవరు నష్టపోకూడదని తన పారితోషికం వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరీ మహేష్ తన రెమ్యునరేషన్ లో ఎంత వెనక్కి తిరిగి ఇస్తున్నాడనే వివరాల్లోకి వెళ్తే.. 30 కోట్లు వెనక్కి ఇవ్వనున్న మహేష్ […]

Mahesh Shocking Decision: బాక్సాఫీస్ వద్ద ‘సర్కారు వారి పాట’ ప్లాప్ టాక్ కి మహేష్ బాగా అప్సెట్ అయ్యాడు. అయితే, ఈ విచారంలోనూ బయ్యర్లు విషయంలో మహేష్ పెద్ద మనసు చేసుకున్నాడు. తన సినిమా కారణంగా ఎవరు నష్టపోకూడదని తన పారితోషికం వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే నిర్మాతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరీ మహేష్ తన రెమ్యునరేషన్ లో ఎంత వెనక్కి తిరిగి ఇస్తున్నాడనే వివరాల్లోకి వెళ్తే..

Mahesh Babu
30 కోట్లు వెనక్కి ఇవ్వనున్న మహేష్
మహర్షి సినిమాతో ఒక్కసారిగా మహేష్ మార్కెట్ స్థాయి బాగా పెరిగింది. దాంతో మహేష్ తన పారితోషికాన్ని 60 కోట్లకు పెంచాడు. అలాగే ప్రతి సినిమాకు భారీ స్థాయిలో షేర్ కూడా అందుకుంటున్న మహేష్.. సర్కారు వారి పాట సినిమాకు కూడా అదే తరహాలో అందుకున్నాడు. కానీ, ఈ సినిమా, ఓపెనింగ్స్ విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది. నిర్మాతలు అదనపు రేట్లకు సినిమాను ముందే అమ్ముకున్నారు. మహేష్ పై నమ్మకంతో సినిమాను కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు నిండా మునిగిపోయారు. అందుకే, తనతో పాటు నిర్మాతలు కూడా మరో ముప్పై కోట్ల వెనక్కి తిరిగి ఇచ్చేసి, నష్టాలు వచ్చిన వారికి సెటిల్మెంట్ చేయనున్నారు
ఈ కలెక్షన్స్ తెలుగు ఇండస్ట్రీకే షాక్
ఈ సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా రాబట్టేలా లేదు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ లెక్కలు ప్రకారం హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని ఒక్క సంధ్య థియేటర్ లో మాత్రమే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించింది. ఇక మిగిలిన అన్నీ చోట్ల 60 శాతం కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఫస్ట్ డే ఈ సినిమా కనీసం ముప్పై కోట్ల కలెక్షన్స్ కూడా అందుకోక పోవడం ఆశ్చర్యకర విషయమే. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా, ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ… మహేష్ సినిమాకి రాకపోవడం.. తెలుగు ఇండస్ట్రీకే షాక్.

Sarkaru Vaari Paata
Also Read: Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !
మహేష్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్
రెండో రోజు సినిమాకి వచ్చిన షేర్ ను బట్టి అంచనా వేస్తే.. మహేష్ కెరీర్ లోనే సర్కారు వారి పాట బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచేలా ఉంది. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ మాటల్లో కొంత నిజం ఉన్నా.. భారీ నష్టాలు తప్పవు. కాకపోతే.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ నిర్మాతలకు కొంత మేరకు నష్టాలు తగ్గిస్తుంది. సరే నిర్మాతలు పరిస్థితి ఎలా ఉన్నా… సినిమాపై పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు మాత్రం దారుణంగా నష్టపోనున్నారు. మహేష్ తన రెమ్యునరషన్ వెనక్కి ఇచ్చినా.. అది బయ్యర్లు అందరికీ చేరుతుందని నమ్మకం లేదు.
ఈ సినిమాతో మహేష్ నంబర్ వన్ పొజిషన్ మారినట్టే !
పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రభాస్ కి ఎనలేని గుర్తింపు ఉన్నా .. ఎన్టీఆర్ – చరణ్ లకి మార్కెట్ స్థాయి పెరిగినా.. తెలుగులో మాత్రం మహేష్ దే టాప్ ప్లేస్. కానీ సర్కారు రిజల్ట్ తో మహేష్ పొజిషన్ చేంజ్ అయ్యేలా ఉంది. నెంబర్ వన్ ప్రభాస్, నెంబర్ 2 ఎన్టీఆర్, నెంబర్ 3కి మహేష్ పడే ఛాన్స్ ఉంది. ఈ నెంబర్ గేమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా లెక్కించబడింది.

Prince Mahesh
రానున్న సినిమాల పై భారీ ప్రభావం :
ఆచార్య విషయంలోనూ బయ్యర్లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. భారీగా నష్టపోయిన బయ్యర్లకు ఎంతో కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేందుకు మెగాస్టార్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవి వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పుడు సర్కారు విషయంలోనూ ఇదే జరిగితే.. ఇక పెద్ద చిత్రాల కొనుగోలు విషయంలో బయ్యర్లు ఆలోచనలో పడతారు. కాబట్టి.. రానున్న పెద్ద సినిమాల పై ఇది భారీగా ప్రభావం చూపెడుతుంది.