Telugu Indian Idol Season 2 Winner: 10 వేల మంది కంటెస్టెంట్స్ ని ఓడించి ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2 ‘ టైటిల్ ని గెలుపొందిన సౌజన్య
టైటిల్ గెలుచుకున్న సౌజన్య మాట్లాడుతూ ‘ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆహా మీడియా కి కృతఙ్ఞతలు. ఇక అల్లు అర్జున్ గారు నా గురించి ఇంత గొప్పగా మాట్లాడడం ని నేను కలలో కూడా ఊచించలేదు.

Telugu Indian Idol Season 2 Winner: ఆహా యాప్ లో అత్యంత ప్రజాధారణ దక్కించుకున్న ప్రోగ్రామ్స్ లో ఒకటి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 . ఇప్పటికే ఈ యాప్ లో మొదటి సీజన్ ప్రసారం అయ్యి పెద్ద హిట్ అయ్యింది. రెండవ సీజన్ కూడా మొదటి సీజన్ లాగానే మొదటి ఎపిసోడ్ నుండి ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకెళ్లింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా విశాఖ పట్నం కి చెందిన సౌజన్య భగవతుల నిల్చింది. ఇక హైదరాబాద్ కి చెందిన జయరాం, సిద్దిపేట కి సంబంధించిన లాస్య ప్రియాలు రెండు మరియు మూడవ స్థానాల్లో నిలిచారు. వీళ్లకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌజన్య కి టైటిల్ అందచేసాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ‘ సంగీతం లో అంత్యంత ప్రతివంతులైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కంటెస్టెంట్స్ ని చూసి మనసంతా అందం తో నిండిపోయింది. ముఖయంగా సౌజన్య అనే అమ్మాయి రెండేళ్ల పసి బిడ్డని పెట్టుకొని కూడా ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందడం నాకు ఎంతో బాగా అనిపించింది.ఒక పక్క కుటుంబ బాధ్యతలు మోస్తూ మరోపక్క సంగీతం అబ్యాసం చేసి, ఇంత మంది ప్రతిభావంతులను అధిగమించి టైటిల్ ని గెలవడం అనేది సాధారమైన విషయం కాదు. ఎంత ప్రశంసించ దగినది. ఆమెకి ఈ సందర్భంగా నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. పెళ్ళైన స్త్రీలు ఇలాంటి పోటీలలో పాల్గొనాలి అంటే భర్తల సహకారం తో పాటు కుటుంబ సహకారం కూడా ఉండాలి. సౌజన్య ఈ స్థాయికి చేరుకునేందుకు ఆమె భర్త మరియు కుటుంబ సభ్యులు ఎంత సపోర్టు ఇచ్చారో అర్థం చేసుకోగలను, ఈ సంగీత ప్రయాణం లో ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలి’ అంటూ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
టైటిల్ గెలుచుకున్న సౌజన్య మాట్లాడుతూ ‘ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆహా మీడియా కి కృతఙ్ఞతలు. ఇక అల్లు అర్జున్ గారు నా గురించి ఇంత గొప్పగా మాట్లాడడం ని నేను కలలో కూడా ఊచించలేదు. ఆయన చేతుల మీదుగా ఈ ట్రోఫీ ని అందుకోవడం అనేది నా అదృష్టం గా భావిస్తాను. ఈ షో నాలోని పట్టుదల మరియు కృషి ని మరింత పెంచాయి’ అంటూ సౌజన్య చెప్పుకొచ్చింది. ఈ పాపులర్ కి 25 ఎపిసోడ్స్ కి గాను 10 వేల మంది సింగర్స్ పాల్గొనగా, అందులో లో కేవలం 5 మంది మాత్రమే ఫైనల్స్ వరకు వచ్చారు. ఆ 5 మందిలో సౌజన్య టైటిల్ విజేతగా నిలిచింది. ఇంతటి ఘనత సాధించిన సౌజన్య కి టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
