Television Couple: ఒక లైక్ కలిపిన రెండు హార్ట్స్ – ప్రియతమ్
Television Couple: బుల్లి తెర లో చెప్పుకోదగ్గ జంటల్లో ఒకరైన జంట ప్రియతమ్,మానస. చూడటానికి చూడ ముచ్చటైన జంటలలో ఒకరైన ఈ జంట కి సినిమా రేంజ్ లో ఉన్న లవ్ స్టోరీ ఉంది. ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన “మనసు మమత” సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకుల కు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత మా టీవి లోని పుట్టింటి […]

Television Couple: బుల్లి తెర లో చెప్పుకోదగ్గ జంటల్లో ఒకరైన జంట ప్రియతమ్,మానస. చూడటానికి చూడ ముచ్చటైన జంటలలో ఒకరైన ఈ జంట కి సినిమా రేంజ్ లో ఉన్న లవ్ స్టోరీ ఉంది.
ప్రియతమ్ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఈటీవీ లో ప్రసారమైన “మనసు మమత” సీరియల్ లోని రాజా పాత్ర. అలా ప్రియతమ్ తన నటన తో ఫ్యామిలీ ప్రేక్షకుల కు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత మా టీవి లోని పుట్టింటి పట్టుచీర సీరియల్ తో మరింత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇలా తన నటన తో బుల్లి తెర లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ ఏర్పరుచుకున్నాడు.
ఈ లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రియతమ్ మనసుని దోచుకున్నది ఎవరో కాదు చంద్రముఖి
క్యారక్ట్ ర్ తో అందరిని మెప్పించిన మానస. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో అనే సీరియల్ లో నటించి బుల్లి తెర కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా వుండగా ప్రియతమ్, మానస వాళ్ళ లైఫ్ పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. అంతే కాకుండా వీళ్లిద్దరూ ఒకే ఊరు కి చెందిన వారు. మనసులతో పాటు ప్రాంతాలు కూడా ఒక్కటైయ్యాయి.
అసలు ప్రియతమ్, మానస ఎలా ఒక్కటేయ్యారు..?
వివరాల్లోకి వెళ్ళితే విజయవాడ కి చెందిన మానస, ప్రియతమ్ ఫేస్ బుక్ లో పరిచయం అయ్యి ప్రేమించుకుని పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రియతమ్ మానస ఫేస్ బుక్ లో ఏ పోస్ట్ పెట్టిన సెకండ్స్ లో వెళ్లి లైక్ కొట్టేవాడట. అలా మానస గుండె ను దోచుకున్నాడు.
ఇలా ఒక లైక్ ఇద్దరి గుండెలను కలిపింది అని ప్రియతమ్ మంగళ వారం 9.30 ల కి ప్రసార మైయిన wow 3 గేమ్ షో లో వాళ్ళ ప్రేమ కథను బయట పెట్టాడు. అలా మొత్తానికి ప్రియతమ్ చెప్పిన “ఒక లైక్ కలిపిన రెండు హార్ట్స్ లవ్ స్టోరీ”ఇదన్న మాట.
