KTR: కేటీఆర్ కు పట్టభద్రుల ఎన్నికల వేళ అసలు ట్రబుల్ మొదలైంది. ఆయన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోగలరా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్,కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సిట్. ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ ఎన్నికల బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించింది.
దీంతో కేటీఆర్ ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల సెగ్మెంట్ లో వరుస సన్నాహక సమావేశాలు పెడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. వరంగల్,కరీంనగర్,ఖమ్మం పట్టబదుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కేవలం రెండే స్థానాలను గెలుచుకోగలిగింది. జనగామ,సూర్యాపేట తప్ప మిగతా అన్ని సెగ్మెంట్లలో ఆ పార్టీ ఓడిపోయింది.
అంతేకాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. దీంతో ఆ పార్టీ ప్రజల్లో రోజురోజుకు బలహీనపడుతూ..వస్తోంది. అందుకే ఈసారి ఎలాగైనా వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రాకేశ్ రెడ్డి గెలుపు బాధితులను పార్టీ కేటీఆర్ అప్పగించింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి తరఫున కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక రాకేష్ రెడ్డి గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్న ..కేటీఆర్ కు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే షాకులు తప్పడం లేదు. ఇటీవల బీఆర్ఎస్ వరంగల్ కీలక నేతల కోసం కేటీఆర్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలే డుమ్మా కొట్టడడం ఆయనను విస్మయానికి గురిచేసింది.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉండగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. పార్లమెంటు ఎన్నికల్లోను ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలో కీలక స్థానంలో ఉన్న కేటీఆర్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించుకోలేకపోతే ఆయనకు రాజకీయంగా ట్రబుల్స్ తప్పవనే చర్చ మొదలైంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More