KCR Mark: వరి పోరుకు కేసీఆర్ మార్క్ ‘శుభంకార్డ్’ పడనుందా?

KCR Mark Rice War: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హిటెక్కుతోన్నాయి. వచ్చే ఏడాది చివరి నాటి కల్లా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఈక్రమంలోనే రాజకీయంగా ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.   రాబోయే ఎన్నికల్లో రైతు ఓటు బ్యాంక్ కీలకంగా కానుంది. రైతులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయం. తొలి నుంచి టీఆర్ఎస్ రైతు […]

Written By: NARESH, Updated On : April 8, 2022 12:54 pm
Follow us on

KCR Mark Rice War: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హిటెక్కుతోన్నాయి. వచ్చే ఏడాది చివరి నాటి కల్లా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అలర్ట్ గా ఉన్నాయి. ఈక్రమంలోనే రాజకీయంగా ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

CM KCR

 

రాబోయే ఎన్నికల్లో రైతు ఓటు బ్యాంక్ కీలకంగా కానుంది. రైతులు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆపార్టీ అధికారంలోకి రావడం ఖాయం. తొలి నుంచి టీఆర్ఎస్ రైతు ఓటు బ్యాంకుపైనే నమ్మకం పెట్టుకుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రైతులు టీఆర్ఎస్ వెంటే నడువడంతో ఆపార్టీ వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని దక్కించుకుంది.

అయితే గత కొంతకాలంగా టీఆర్ఎస్ పై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వరి పంట వేయద్దని సీఎం కేసీఆర్ చెప్పడం, ధాన్యం కొనుగోలు విషయంలో తరుగు పేరుతో రైతులను ప్రభుత్వం నట్టేట ముంచడం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడం, కౌలు రైతుకు రైతు బంధును అమలు చేయకపోవడం వంటి విషయాల్లో టీఆర్ఎస్ పై రైతులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

యాసంగిలో వరి పంట వేయద్దని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించే వారికి రైతు బంధు ఉండొదని స్పష్టం చేశారు. దీనిపై రైతుల నుంచి విమర్శలు రావడంతో రైతు బంధును మాత్రం అమలు చేశారు. అయితే ధాన్యం కొనుగోలుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

బీజేపీ నేతల వల్లే తెలంగాణలో రైతులు వరి పంటను పెద్దమొత్తంలో వేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్రమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఈనెల 11న ఢిల్లీలో ధర్నాకు సైతం సిద్ధమవుతున్నారు. ఈరోజున టీఆర్ఎస్ శ్రేణులంతా ఢిల్లీలో కదంతొక్కే అవకాశం ఉంది.

పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో కేంద్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు. దీంతో రైతులు నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేపట్టే అవకాశం ఉంది. రైతులు నష్టపోయేలా బీజేపీ చూసినా.. తాము రైతులను ఆదుకున్నామని టీఆర్ఎస్ రాజకీయంగా ప్రచారం చేసుకునే అవకాశం దక్కనుంది.

కాగా ఇప్పటికే ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎఫ్సీఐతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అప్పగించనుంది. ఇంకా ధాన్యం మిగిలినట్లయితే స్థానికంగా వినియోగించడమో.. లేదంటే ఎగుమతి చేయడమో చేయనుంది. తద్వారా గంపగుత్తగా సీఎం కేసీఆర్ క్రెడిట్ దక్కించుకొని వడ్ల ఉద్యమానికి శుభంకార్డ్ వేయనున్నారని తెలుస్తోంది.