Site icon OkTelugu

Jagga Reddy: మేము బాధపడ్డాం.. కానీ వారు.. రాజశేఖర్ రెడ్డి మరణం పై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పటికీ చాలామంది నేతలు అభిమానం చూపిస్తుంటారు. కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తుంటారు. అయితే తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో నాటి రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో జరిగిన పరిణామాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వైయస్ మరణం వెనుక జగన్ ఉన్నారన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతల అనుమానం బయటపడింది. ముఖ్యంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు బొత్స ఇదే తరహా అనుమానం వ్యక్తం చేశారని.. టిడిపి కూటమి మంత్రి కింజరాపు అచ్చెనాయుడు కామెంట్స్ చేయడం ఇప్పుడు దూమారం రేపుతోంది. దీనిపై బొత్స స్పందించి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యాంతం అయ్యారు. కానీ అప్పట్లో బొత్స చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయనతోపాటు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

* సోషల్ మీడియాలో వైరల్..
తాజాగా తెలంగాణకు చెందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి వైయస్ మరణం సమయంలో జరిగిన పరిస్థితులను వివరిస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఎమ్మెల్యే అయ్యారు జగ్గారెడ్డి. ఆయన అంటే విపరీతమైన అభిమానం కూడా. అయితే నాడు రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో తమలాంటివారు బాధలో ఉంటే.. ఆయన కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ చేపట్టారంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* అప్పటి నుంచి ఈ ఆరోపణలే..
అయితే గతం నుంచి జగన్మోహన్ రెడ్డి పై ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. హెలిక్యాప్టర్ ప్రమాదంలో నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే.. మరోవైపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇప్పటివరకు అదే ఆరోపణలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి వైయస్ మరణం, ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ వంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version