Domestic Violence Cases: అతివలకు తెలంగాణలో భద్రత లేదు: గృహ హింసలో మన స్థానమిదీ
Domestic Violence Cases: అతివలకు తెలంగాణలో భద్రత లేకుండా పోతోంది. కట్టుకున్న భర్త నుంచే ‘ఆమె’కు వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇందులో కుటుంబ సభ్యుల వాటా కుడా ఉంటోంది. దేశంలోనూ గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. గృహహింస కేసుల జాబితాలో 50.4 శాతం తో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో అసోం(75ు) ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీ(48.9ు) మూడో స్థానంలో ఉంది. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ […]


Domestic Violence Cases
Domestic Violence Cases: అతివలకు తెలంగాణలో భద్రత లేకుండా పోతోంది. కట్టుకున్న భర్త నుంచే ‘ఆమె’కు వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇందులో కుటుంబ సభ్యుల వాటా కుడా ఉంటోంది. దేశంలోనూ గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. గృహహింస కేసుల జాబితాలో 50.4 శాతం తో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ జాబితాలో అసోం(75ు) ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీ(48.9ు) మూడో స్థానంలో ఉంది. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వేలో ఈ విషయా లు వెల్లడయ్యాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో మూడో వంతు కట్టుకున్న భర్త, అతని బంధువుల నుంచే ఎదుర్కొంటున్నారు. ఉద్దేశపూర్వక దాడు లు, కిడ్నాప్, అత్యాచారయత్న ఘటనలు.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. ఈ రకమైన వేధింపులు 2015-16లో 33.3 శాతం ఉండగా.. 2019-21 నాటికి కొద్దిగా తగ్గి 31.9 శాతానికి చేరాయి. అయినా మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నట్లు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా 21.22 లక్షల కేసులు
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించి 2021 నాటికి కోర్టుల్లో 21.22 లక్షల కేసులున్నాయి. వీటి లో ఇప్పటివరకు 83,536 కేసులు పరిష్కారమయ్యా యి. ఈ తరహా కేసుల విషయంలో కోర్టులు మరింత వేగం పెంచాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. ఇటు 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, ఇది 2011 నాటికి 47,746కు పెరిగింది. కాగా 2021 నాటికి 45,026గా ఉన్నాయి. అయితే కొంతమేర తగ్గినట్టు నివేదికలో పొందుపరిచినా.. క్షేత్రస్థాయిలో జరిగిన ఘటనలు, నేషనల్ క్రైమ్ బ్యూరో దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయని సర్వే తెలిపింది. ఆత్మహత్య ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని సర్వే సూచించింది.

Domestic Violence Cases
ఇంట్లోనే వేధింపులు
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను పరిశీలిస్తే ముఖ్యంగా ఇంట్లోనే వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోంది. 2016లో భర్త, అతడి బంధువుల నుంచి ఎదుర్కొన్న సమస్యలపై 1,10,378 ఘటనలు ఉండగా, ఇవీ 2021 నాటికి 1,36,234గా నమోదయ్యాయి. ఇక అత్యాచార ఘటనలు 2016లో 38,947 ఉండగా, 2021నాటికి 31,677గా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు 2016లో 64,519 ఉండగా, 2021 నాటికి 75,369గా ఉన్నాయి. ఉద్దేశపూర్వక వేధింపులు, లైంగిక వేధింపుల ఘటనలు 2016లో 84,746 ఉండగా, 2021 నాటికి 89,200కు చేరాయి. వరకట్న వేధింపుల ఘటనలు సైతం పెరుగుతున్నాయి. ఇవి 2016లో 9,683 ఉండగా, 2021 నాటికి 13,568కు చేరాయి. మొత్తంగా మహిళలపై జరుగుతున్న దాడు లు 2016లో 3,38,954 ఉండగా, ఇది 2021 నాటికి 4,28,278కి చేరాయి. ఇక ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయని, వీటిల్లో బిహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 40 శాతంతో ముందున్నట్లు సర్వే తెలిపింది. మహిళలపై జరుగుతున్న నేరాల శాతంలోనూ 6వ స్థానంలో తెలంగాణ ఉంది.