Hyderabad: హైదరాబాద్‌లో చీమ చిట్టుక్కుమన్నా పట్టేస్తారు.. దేశంలోనే టాప్‌.. ఎలా సాధ్యమైంది?

అధ్యయన సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ప్రతీ వెయ్యి మంది నివాసితులకు 36.52 కెమెరాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో 117 సీసీ కెమెరాలతో చైనా దేశంలోని టైయావున్‌ నగరం ఉంది.

  • Written By: Raj Shekar
  • Published On:
Hyderabad: హైదరాబాద్‌లో చీమ చిట్టుక్కుమన్నా పట్టేస్తారు.. దేశంలోనే టాప్‌.. ఎలా సాధ్యమైంది?

Hyderabad: విశ్వనగరం హైదరాబాద్‌ చాలా భద్రమట. దేశంలోనే అత్యంత నిఘా ఉన్న నగరాల్లో మన భాగ్యనగర్‌ రెండో స్థానంలో నిలిచింది. విశ్వవ్యాప్తంగా తొలి 50 నగరాల జాబితాలో హైదరాబాద్‌ 41వ స్థానంలో నిలిచింది. అత్యుత్తమ సర్వేలైన్స్‌ వ్యవస్థను కలిగిన తొలి 20 జాబితాలో చైనాలోని పలు నగరాలు నిలవగా.. ఉత్తమ 50 నగరాల్లో భారత్‌ నుంచి ఢిల్లీ 22, హైదరాబాద్‌ 41వ స్థానంలో ఉన్నాయి.

వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ సర్వే..
అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థను కలిగిన నగరాల జాబితాను ప్రముఖ అధ్యయన సంస్థ వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ రూపొందించింది. తాజా జాబితాను ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేసింది. జనాభా, సీసీ కెమెరాలు, నగర విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కు ఉత్తమ స్థానం దక్కింది.

ఎలా సాధ్యమైంది?
అధ్యయన సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ప్రతీ వెయ్యి మంది నివాసితులకు 36.52 కెమెరాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో 117 సీసీ కెమెరాలతో చైనా దేశంలోని టైయావున్‌ నగరం ఉంది. ఇండియాలోని ఇండోర్‌ 64.4 కెమెరాలతో నాలుగవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 33.73 కెమెరాలతో రాజధాని ఢిల్లీ 16వ స్థానంలో ఉంది. టాప్‌ 20 నగరాల్లో ఇండియా నుంచి మూడు నగరాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

కంట్రోల్‌ ఇన్‌ కమాండ్‌..
విశ్వనగరంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిఘా మరింత పటిష్టమైంది. నగరంలోని 10 లక్షల కెమెరాలు కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. నగరంలో అదనంగా 5.80 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10 లక్షల కెమెరాలను కంట్రోల్‌లోకి చేశారు. దీంతో అడుగడుగూ సీసీ కెమెరాలో నిఘాలోకి వెళ్లింది.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు