TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఆ శాఖలో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..
ఆయుష్ విభాగంలో మొత్తం 156 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మెడియల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) 54, హోమియో 33, యునానీ 69 చొప్పున భర్తి చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22 సాయంత్రం 5లోగా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడునని, ఆతరువాత దరఖాస్తులు తీసుకోరని తెలిపారు.

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే వరుస నోటిఫికేషన్లు వేస్తూ ఖాళీలను నింపుతోంది. తాజాగా వైద్యశాఖలో భర్తీ చేసేందుకు సమయాత్తమైంది. వైద్యశాఖలో భాగమైన ఆయుష్ విభాగంలో 156 ఖాళీలను నింపేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే.
ఆయుష్ విభాగంలో మొత్తం 156 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మెడియల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) 54, హోమియో 33, యునానీ 69 చొప్పున భర్తి చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22 సాయంత్రం 5లోగా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడునని, ఆతరువాత దరఖాస్తులు తీసుకోరని తెలిపారు.
ఈ పోస్టులకు దరఖాస్తులు చేయాలనుకునేవారి వయసు 18 నుంచి 44 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు చేయడానికి ఓపెన్ కేటగిరీ కి చెందిన వారు రుసు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ డబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఎటువంటి ఫీజును వసూలు చేయరు. ఈమేరకు జూలై 13 సాయంత్రం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లుడుతూ వైద్యశాఖలో కొలువుల జాతర ప్రారంభమైందని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.