TSPSC: అండర్ ” కంట్రోల్”.. పోయిన టీఎస్ పీఎస్సీ పరువు తిరిగి తెస్తుందా?

TSPSC: “మా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రాల అన్నింటికంటే గొప్పది. మిగతా ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ అర్హత పరీక్షలు ఎలా నిర్వహించాలో మా దగ్గర చూసి, వారి రాష్ట్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు కాబట్టే ఇంతటి ఘనత సాధ్యమైంది” ఇవీ […]

  • Written By: Bhaskar
  • Published On:
TSPSC: అండర్ ” కంట్రోల్”.. పోయిన టీఎస్ పీఎస్సీ పరువు తిరిగి తెస్తుందా?
TSPSC

TSPSC

TSPSC: “మా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రాల అన్నింటికంటే గొప్పది. మిగతా ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ అర్హత పరీక్షలు ఎలా నిర్వహించాలో మా దగ్గర చూసి, వారి రాష్ట్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు కాబట్టే ఇంతటి ఘనత సాధ్యమైంది” ఇవీ నిన్నా మొన్నటి వరకు భారత రాష్ట్ర సమితి, నమస్తే తెలంగాణ పేపర్ కొట్టిన డప్పు, వాయించిన డోలు.. అయితే పేపర్ లీక్ లు వెలుగులోకి వచ్చాయో అప్పుడే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు గంగలో కలిసింది. కమిషన్ పై ఉన్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమైంది. కీలకమైన కస్టోడియల్ నుంచి ఎగ్జామ్ విభాగం వరకు అన్ని లోపాలకుప్పలే అని తేలిపోయింది. ఇంత జరిగినా ప్రభుత్వం మొన్నటివరకు సరైన చర్యలే తీసుకోలేదు. పైగా పేపర్ లీక్ పై ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్షాలను డైవర్ట్ చేసేందుకు తెర పైకి కొత్త కొత్త విషయాలను తీసుకొచ్చింది. దీనికి తోడు తల తోకాలేని కేసులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూసింది.

ఇవన్నీ జరిగిన తర్వాత.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు.. ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు విభాగానికి కంట్రోలర్ ను నియమించింది. అంతేకాదు కొత్తగా న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం పది పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇక్కడే ప్రభుత్వం మరోసారి తప్పు చేస్తోంది. ఎందుకంటే వాస్తవానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనే రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన హామీల ప్రకారం అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగులు ఉండాలి. కానీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో నియమించకుండా ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టడంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు గంగలో కలిసిపోతుంది. ఎందుకంటే గ్రూప్_1 పేపర్ లీకేజీ కి సంబంధించిన వ్యవహారంలో ప్రవీణ్ కు ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి..ఇతడు ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇలాంటి వారి స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించకుండా ప్రభుత్వం కేవలం 10 పోస్టులకు పచ్చ జెండా ఉప్పడం నిజంగా ఆశ్చర్యకరం.

TSPSC

TSPSC

వాస్తవానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగుల మీద తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీనివల్లే తప్పులు దొర్లుతున్నాయి. రేణుక విషయంలోనూ ఇలాంటి తప్పు దొర్లడం వల్లే ఆమె ప్రవీణ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది.. వారిద్దరి పరిచయం ఇంతటి దారుణానికి దారితీసింది.. ముఖ్యమైన పరీక్షల విభాగంపై దృష్టి పెట్టామని చెబుతున్న ప్రభుత్వం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సహా మూడు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని వివరిస్తోంది. కానీ ఈ పోస్టులు మాత్రమే పరీక్షలు నిర్వహించలేము. కీలక స్థానంలో ఉన్న వ్యక్తులతో పాటు కిందిస్థాయి సిబ్బంది కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చాలా అవసరం. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పది పోస్ట్ లు మాత్రమే కేటాయించి..మిగతా పనులు ఔట్ సోర్సింగ్ వారితో చేయిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.

Tags

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు